AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: ఒక షేరుకు 10 షేర్లు.. ఏకంగా 977 శాతం లాభాలు.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మీదగ్గరుంటే కోటీశ్వరులే..!

Multibagger Stock Returns: ప్రముఖ ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారీ సంస్థ అవ్రో ఇండియా లిమిటెడ్ తన వాటాదారులకు భారీ కానుక ప్రకటించింది. కంపెనీ తన షేర్లను 10:1 నిష్పత్తిలో విభజించాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో దాదాపు 977 శాతం అద్భుతమైన లాభాలను అందించిన ఈ మల్టీబ్యాగర్ స్టాక్, ఇప్పుడు సామాన్య ఇన్వెస్టర్లకు మరింత చేరువ కానుంది. మే 5వ తేదీని కీలక గడువుగా నిర్ణయించింది.

Multibagger: ఒక షేరుకు 10 షేర్లు.. ఏకంగా 977 శాతం లాభాలు.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మీదగ్గరుంటే కోటీశ్వరులే..!
Avro India Stock Split
Venkata Chari
|

Updated on: Apr 28, 2026 | 6:28 PM

Share

Avro India Stock Split: అవ్రో ఇండియా లిమిటెడ్ బోర్డు తమ ఈక్విటీ షేర్ల విభజనకు (స్టాక్ స్ప్లిట్) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 10 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో షేరును, 1 రూపాయి ఫేస్ వాల్యూ కలిగిన పది షేర్లుగా విభజించనున్నారు. దీనివల్ల ఇన్వెస్టర్ల వద్ద ఉన్న షేర్ల సంఖ్య పది రెట్లు పెరుగుతుంది. కానీ, వారి మొత్తం పెట్టుబడి విలువలో మార్పు ఉండదు. ఈ ప్రక్రియ కోసం కంపెనీ 2026 మే 5వ తేదీని రికార్డు తేదీగా, ఎక్స్-డేట్‌గా నిర్ణయించింది. ఈ తేదీ నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉన్న వారు మాత్రమే ఈ విభజన ప్రయోజనాన్ని పొందగలరు.

స్టాక్ పనితీరు..

గత కొన్ని నెలలుగా ఈ షేరు ధర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ షేరు సుమారు 125.15 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, 10 షేర్లుగా విడిపోతే అప్పుడు దాదాపు ఒక్కో షేర్ ధర సుమారు 12.5 రూపాయలుగా ఉండనుంది. గడిచిన వారంలో స్వల్ప వృద్ధిని కనబరిచిన ఈ స్టాక్, గత నెల రోజుల్లో 6.5 శాతం పెరిగింది. అయితే, గత ఏడాది కాలంలో సుమారు 17.77 శాతం మేర పతనాన్ని చవిచూసింది. కానీ, అసలైన మ్యాజిక్ ఐదేళ్ల కాలంలో కనిపిస్తుంది. గత ఐదేళ్లలో ఈ కంపెనీ ఏకంగా 977.68 శాతం లాభాలను పంచిపెట్టి ఇన్వెస్టర్ల సంపదను పది రెట్లు పెంచింది.

కంపెనీ ఆర్థిక స్థితిగతులు..

అవ్రో ఇండియా ఆర్థికంగా స్థిరంగా కనిపిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 166 కోట్ల రూపాయలుగా ఉంది. రుణ ఈక్విటీ నిష్పత్తి 0.27గా ఉండటం కంపెనీకి సానుకూల అంశం. ఆదాయ మార్గాలను పరిశీలిస్తే, 2021లో 53.57 కోట్లుగా ఉన్న ఆదాయం, 2024 నాటికి 97.37 కోట్లకు చేరింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 82.93 కోట్ల ఆదాయం, 3.04 కోట్ల లాభాన్ని గడించింది. పరిశ్రమ సగటుతో పోలిస్తే కంపెనీ విలువలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

షేర్ల విభజన వల్ల మార్కెట్లో షేర్ల లభ్యత పెరిగి, చిన్న ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అయితే, ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ నష్టభయాన్ని గమనించాలి. గడిచిన మూడేళ్లలో ఈ షేరు సుమారు 12 శాతం క్షీణించిన నేపథ్యంలో, ఇన్వెస్టర్లు తమ ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు