భారతదేశంలో ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లను విక్రయించే కంపెనీ కవాసకి బుధవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. కంపెనీ తన శ్రేణిలోని కొన్ని మోటార్‌సైకిళ్లపై రూ.1 లక్ష వరకు ప్రయోజనాలను ప్రకటించింది. అంటే డిస్కౌంట్‌లు. ఇప్పుడు కస్టమర్లు కవాసకి ZX-10R, వెర్సిస్ 1100, వెర్సిస్ 650, వెర్సిస్-X 300 లను భారీ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ జూలై 31 వరకు మాత్రమే చెల్లుతుంది.
ఇది కూడా చదవండి: Bank Alert: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? మీకో బిగ్ అలర్ట్.. ఆగస్టు 8 వరకు గడువు.. లేకుంటే అకౌంట్ క్లోజ్!
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్ గురించి మీకు తెలుసా?
- కవాసకి వెర్సిస్-X 300: ఈ కవాసకి బైక్ ఇటీవలే అప్‌డేట్ చేసింది. దానిపై రూ.15,000 వరకు విలువైన అడ్వెంచర్ యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. ఇది వెర్సిస్ సిరీస్‌లో అతి చిన్న బైక్. ఇది నింజా 300 నుండి అప్‌డేట్ పొందింది. దీనిలో 296cc ట్విన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 11,500 rpm వద్ద 38.5 bhp పవర్, 10,000 rpm వద్ద 26.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది.
- కవాసకి వెర్సిస్ 650: కవాసకి వెర్సిస్ 650 పై రూ. 25,000 ప్రయోజనం లభిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత దాని ధర రూ.7.77 లక్షల నుండి రూ. 7.52 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ఇది అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ఒక ప్రసిద్ధ బైక్. ఇది 649cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 65.7 bhp పవర్‌ణి, 61 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా వస్తుంది. దీని లక్షణాలలో LED లైట్లు, TFT డిస్‌ప్లే, (స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో), USB ఛార్జింగ్ పోర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ (ఆన్-ఆఫ్ ఆప్షన్) మరియు ABS ఉన్నాయి.
- కవాసకి నింజా ZX-10R: కవాసకి నింజా ZX-10R ప్రస్తుతం రూ.1,00,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.18.50 లక్షలు. ఇది 998cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 13,200 rpm వద్ద 200 bhp శక్తిని, 11,400 rpm వద్ద 114.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్, క్విక్ షిఫ్టర్‌తో వస్తుంది. దీని లక్షణాలలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో TFT డిస్‌ప్లే, విభిన్న రైడింగ్ మోడ్‌లు, డ్యూయల్-ఛానల్ ABS, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.
- కవాసకి వెర్సిస్ 1100: కవాసకి వెర్సిస్ 1100 కూడా రూ.1,00,000 వరకు ప్రయోజనాలను పొందుతోంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షలు. కొన్ని నెలల క్రితం దీని ఇంజిన్ 2025 మోడల్‌లో 1099ccతో వస్తుంది. దీనితో ఇది ఇప్పుడు 9,000 rpm వద్ద 133 bhp శక్తిని, 7,600 rpm వద్ద 112 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్, అసిస్ట్ క్లచ్ లభిస్తాయి. ఇది స్పోర్ట్స్ టూరింగ్ బైక్.
ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్ కారు.. 6 ఎయిర్ బ్యాగ్స్.. చౌకైన కారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి