
భారత్‌ను అత్యంత ప్రమాదకర కేటగిరిలో పెట్టింది ఆస్ట్రేలియా. వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆస్ట్రేలియాలో విద్యార్థులకు వీసాలు మంజూరు చేసే అంచనా ఫ్రేమ్‌వర్క్ AL1 (అత్యల్ప ప్రమాదం) నుండి AL3 (అత్యధిక ప్రమాదం) వరకు ఉంటుంది. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో భారత్‌ను AL3 కేటగిరిలో పెట్టింది కంగారు కంట్రీ. భారత్ నుంచి సాధారణంగా వేల మంది విద్యార్థులు ఆస్ట్రేలియాకి వెళ్లి చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ AL3 కేటగిరి ఎలాంటి ప్రభావం చూపుతుందో అని విద్యార్థలు ఆందోలన చెందుతున్నారు. ఈ మార్పుతో విద్యార్థులకు సంబంధించిన ప్రతీ అంశం మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఈ మార్పులు జనవరి 8 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పు సమస్యల ప్రభావవంతమైన నిర్వహణకు సహాయపడుతుంది, అదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన విద్యను కోరుకునే నిజమైన విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తూనే ఉంటుంది అని ఆస్ట్రేలియా తెలిపింది. భారత్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి అనేక ఇతర దక్షిణాసియా దేశాలు కూడా AL3 కేటగిరీలో చేర్చింది ఆసీస్. పాకిస్తాన్ ఈ అత్యధిక ప్రమాద శ్రేణిలోనే ఉంది.
నివేదిక ప్రకారం.. విద్యార్థులు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్, ఆంగ్ల ప్రావీణ్యం, నిజమైన తాత్కాలిక ప్రవేశ ఉద్దేశ్యాలు, ఇతర ప్రమాణాలకు సంబంధించిన విస్తృతమైన రుజువులను అందించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ మాజీ డిప్యూటీ సెక్రటరీ అబుల్ రిజ్వి మాట్లాడుతూ.. అధిక రిస్క్ స్థాయిలకు మరిన్ని డాక్యుమెంటేషన్ అవసరమని, అధికారులు డాక్యుమెంటేషన్‌ను పరిశీలిస్తారని అన్నారు. వారు ట్రాన్స్‌క్రిప్ట్‌లను తనిఖీ చేయడానికి సంస్థలకు ఫోన్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేటస్ కోసం బ్యాంకును సంప్రదించవచ్చు అని ఆయన అన్నారు. భారతదేశంలో ఇటీవల జరిగిన భారీ నకిలీ డిగ్రీల వ్యవహారం ఈ మార్పుకు కారణం కావచ్చని ఆయన అన్నారు.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు 10 లక్షలకు పైగా వ్యక్తుల మోసపూరిత పత్రాలను సరఫరా చేసిన నకిలీ సర్టిఫికేట్ రాకెట్‌ను కేరళ పోలీసులు బయటపెట్టారు. ఈ మోసానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడంలో ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ ప్రభుత్వం విఫలమైందని ఆస్ట్రేలియా సెనేటర్ మాల్కం రాబర్ట్స్ ఆరోపించారు. భారతదేశంలోని పోలీసులు 22 విశ్వవిద్యాలయాల నుండి 100,000 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారని, వాటిలో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది విదేశాలలో ఉద్యోగాల కోసం ఉపయోగించిన అవకాశం ఉందని ఆరోపించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి