ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా కంపెనీలు కూడా పెద్ద ఎత్తున వాటిని లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లు, అప్ గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వాటిల్లో ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు మన దేశంలో మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో ఏథర్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యామిలీ స్కూటర్ పేరుతో తీసుకొస్తున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్ అండ్ సీఈఓ తరుణ్ మెహతా ధ్రువీకరించారు. మన దేశంలోని రోడ్లపై ఇప్పటికే పలు దశల్లో ఈ ఫ్యామిలీ స్కూటర్ ను పరీక్షించినట్లు చెప్పారు. ఇది 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే కాక ఇప్పటికే ఉన్న 450 సిరీస్ లోనూ మరో వేరియంట్ ను తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇది కూడా 2024లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Time for a family scooter…. and more!
ఇవి కూడా చదవండిAfter spending a decade perfecting the Ather 450, we now believe that there’s demand for something more.
So many folks love @atherenergy as a brand but want a bigger, family-oriented scooter from us. That’s why we’re gearing up to launch…
— Tarun Mehta (@tarunsmehta) November 22, 2023
ఏథర్ పరీక్షించిన ఫ్యామిలీ స్కూటర్ కు సంబంధించిన కొన్ని రహస్య చిత్రాలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో స్లిమ్ హెడ్ ల్యాప్, టెయిల్ ల్యాంప్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే గ్రాబ్ రెయిల్, పొడవైన, వెడల్పైన సీటు ఉంటుంది. తద్వారా రైడర్ కు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. అలాగే స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. ఈ స్కూటర్లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్స్ ఉన్నాయి. ముందువైపు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్లో హబ్ మోటార్ లేదా బెల్ట్ ఆధారిత మోటార్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏథర్ అన్ని స్కూటర్లకు బెల్ట్ డ్రివెన్ మోటార్లే వినియోగిస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ కు పోటీగా ఈ ఏథర్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొస్తుంది. అంతేకాక ఈ స్కూటర్ అనువైన బడ్జెట్లోనే ఉంటుందని ఏథర్ ప్రకటించింది.
ఫ్యామిలీ స్కూటర్ తో పాటు ఏథర్ మరో స్కూటర్ ను కూడా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉన్న 450 సిరీస్లో మరో వేరియంట్ గా దీనిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని ధర మాత్రం ప్రీమియం రేంజ్ ఉంటుందని చెబుతున్నారు. మన దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే ఈ ఏథర్ కంపెనీ స్కూటర్ల రేటు కాస్త ఎక్కువగానే ఉంది. కానీ దాని పనితీరు, ఫీచర్లు అందుకు తగ్గట్లుగానే ఉంటుంది. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త స్కూటర్ ధర కూడా ఎక్కువగా ఉండనున్నట్లు చెబుతుండటంతో దానిలో ఫీచర్లు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..