AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో హవా.. దీనికి ఎందుకంత డిమాండ్‌?

Electric Scooter: ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రంగంలో తాము రికార్డు సృష్టిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ స్వప్నిల్ జైన్ అన్నారు. 5,00,000 స్కూటర్ల తయారీ దాటడం చాలా పెద్ద మైలురాయిగా ఉందన్నారు. మొదటి ప్రోటోటైపు నుండి ఇప్పటివరకు, మా ప్రయాణం వాహనాలు..

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో హవా.. దీనికి ఎందుకంత డిమాండ్‌?
Subhash Goud
|

Updated on: Oct 09, 2025 | 12:02 PM

Share

Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్‌లో హవా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యం ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కూడా హవా కొనసాగిస్తున్నాయి. మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లోనే ఎక్కువ రేంజ్‌ ఇచ్చేలా స్కూటర్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రంగంలో భారతీయ కంపెనీ అయిన ఏథర్‌ ఎనర్జీ అద్భుతమైన స్కూటర్లను తీసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన స్కూటర్లు సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్నాయి. తమ హోసూర్ ప్లాంట్‌లో తయారుచేసిన 5,00,000వ స్కూటర్‌ను విడుదల చేసి, దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీని కొత్త ఎత్తుకి తీసుకు వచ్చింది. ఈ స్కూటర్ ఏథర్ రిజ్టా మోడల్. ఈ కంపెనీ నుంచి కుటుంబ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తోంది. గత సంవత్సరం ఇది మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?

రికార్డును సృష్టిస్తున్నాం: కంపెనీ సీఈవో

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రంగంలో తాము రికార్డు సృష్టిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ స్వప్నిల్ జైన్ అన్నారు. 5,00,000 స్కూటర్ల తయారీ దాటడం చాలా పెద్ద మైలురాయిగా ఉందన్నారు. మొదటి ప్రోటోటైపు నుండి ఇప్పటివరకు, మా ప్రయాణం వాహనాలు మాత్రమే కాకుండా, పెద్ద స్థాయిలో, నమ్మకమైన తయారీ వ్యవస్థను కూడా సృష్టించడమే లక్ష్యమని అన్నారు.

ఇవి కూడా చదవండి

గరిష్ట వేగం:

ఇప్పటివరకు మొత్తం తయారీ వాల్యూమ్‌లో మూడవ భాగం ఏథర్ రిజ్టా మోడల్‌దే. ఏథర్ రిజ్టా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఏప్రిల్ 2024లో విడుదలైంది. దీని‌లో 4.3 కిలోవాట్ పర్మనెంట్ మాగ్నెటిక్ సింక్రనస్ మోటార్ ఉంటుందని అన్నారు ఇది 22 న్యూటన్-మీటర్ల టార్క్ ఇస్తుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు కాగా, 0 నుండి 40 కిలోమీటర్ల వేగానికి సుమారు 4.7 సెకన్లు పడుతుందని కంపెనీ చెబుతోంది.

రెండు బ్యాటరీ ఆప్షన్లు:

ఈ స్కూటర్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయని, 2.9 కెహెచ్ బ్యాటరీతో 123 కి.మీ వరకు రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మరొక 3.7 కెహెచ్ బ్యాటరీతో 160 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌కు పూర్తి ఛార్జింగ్‌ కావాలంటే సుమారు 8.3 గంటల సమయం పడుతుంది. అలాగే స్టోరేజీ విషయంలో కూడా బాగుంది. సీట్ కింది భాగంలో 34 లీటర్ల స్టోరేజీని అందించింది. ఇక ముందు భాగంలో 22 లీటర్ల అదనపు ట్రంక్ ఉంది.ఇందులో హెల్మెట్ పెట్టుకోవడానికి, సరుకులు తీసుకురావడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఫీచర్స్‌:

ఈ స్కూటర్‌లో అనేక రకాల ఫీచర్స్‌ ఉన్నాయి. బ్లూటూత్‌, వైఫై కనెక్టివిటి, రిమోట్‌ లాకింగ్‌ సిస్టమ్‌,7 అంగుళాల డిస్‌ప్లే, టీఎఫ్‌టీ టచ్‌ స్క్రీన్‌, ట్రిప్‌ మానిటరింగ్‌ ఛార్జింగ్ పోర్ట్‌ ఇలాంటి ఫీచర్స్‌తో పాటు మర్నె ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. అలాగే ధరల విషయానికొస్తే.. రూ.1,09,999 నుండి రూ.1,44,000 వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: Gold Price: వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. కొనాలంటేనే భయపడిపోతున్న జనాలు!

Hyderabad’s First Tesla EV: తెలంగాణలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్‌ కారును కొన్నది ఎవరో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?