Gold Price: వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. కొనాలంటేనే భయపడిపోతున్న జనాలు!
Gold Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని..

Gold Price: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. పెరుగుతున్న పసిడితో సామాన్యుడు గ్రాము ధర కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. బంగారం అంటేనే మహిళలు బయపడే రోజులు వచ్చాయి. తాజాగా అక్టోబర్ 9వ తేదీన తులం బంగారం ధరపై రూ.220 పెరిగి రూ.1,24,150కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.1,61,000లకు చేరుకుంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే వెండి ధర మరింతగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 1,71,000 రూపాయలు ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
24 క్యారెట్ల 10 గ్రాముల ధర :
- హైదరాబాద్: రూ.1,24,150
- ఢిల్లీ: రూ.1,24,300
- ముంబై: రూ.1,24,150
- చెన్నై: రూ.1,24,370
- బెంగళూరు: రూ.1,24,150
- కేరళ: రూ.1,24,150
22 క్యారెట్ల 10 గ్రాముల ధర:
- హైదరాబాద్: రూ.1,13,800
- ఢిల్లీ: రూ.1,13,950
- ముంబై: రూ.1,13,800
- చెన్నై: రూ.1,14,000
- బెంగళూరు: రూ.1,13,800
- కేరళ: రూ.1,13,800
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు మరియు ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
