AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం కొనేటప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. లేకపోతే నష్టపోవడం గ్యారెంటీ..

ధంతేరాస్ వచ్చిందంటే చాలు... బంగారం కొనడానికి ప్రజలు క్యూ కడతారు. ఇంట్లో అదృష్టం, సిరి సంపదలు ఉండాలని బంగారం కొంటుంటారు. అయితే ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష దాటేసింది. అందుకే బంగారం కొనేటప్పుడు చిన్న పొరపాటు చేసినా, లక్షల్లో నష్టం తప్పదు. నిజమైన బంగారాన్ని ఎలా గుర్తించాలి..? సరైన స్వచ్ఛతను ఎలా ఎంచుకోవాలి..? వంటి విషయాలను తప్పక తెలుసుకోవాలి.

Krishna S
|

Updated on: Oct 09, 2025 | 8:30 AM

Share
BIS హాల్‌మార్క్‌ : మీరు కొనే బంగారం నిజమైనదా, కాదా అని చెప్పేది BIS హాల్‌మార్క్ మాత్రమే.. మీరు కొనే ప్రతి ముక్కపై BIS లోగో, స్వచ్ఛత సంఖ్య 6 అంకెల HUID కోడ్ ఉందో లేదో చెక్ చేయండి. ఈ హాల్‌మార్క్ లేని బంగారాన్ని ఎప్పుడూ కొనొద్దు.

1 / 5
క్యారెట్‌ను బట్టే బంగారం ధర, స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. 24K అంటే స్వచ్ఛమైన బంగారం. ఇది చాలా మెత్తగా ఉంటుంది.. అందుకే నగలు చేయరు. 22K బంగారం ఆభరణాలు, నగలు చేయడానికి బెస్ట్ అని అంటారు. ఇక 18K బంగారంలో మన్నిక కోసం ఇతర లోహాలు కలుపుతారు. నగలు కొనేటప్పుడు ఇవి కచ్చితంగా అడిగి తెలుసుకోండి.

2 / 5
తయారీ ఛార్జీలు: నగలకు పెట్టే ధరలో తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇవి 5శాతం నుంచి 20శాతం వరకు ఉంటాయి. వీటిపై బేరం ఆడండి. 10శాతం కంటే ఎక్కువ చెల్లించకుండా ప్రయత్నించండి. మీరు బంగారు నాణేలు లేదా బార్‌లు కొంటే ఈ ఛార్జీలు చాలా తక్కువగా లేదా అసలు ఉండవు.

3 / 5
తూకం, బిల్లు పక్కాగా: మీ కళ్ల ముందే డిజిటల్ స్కేల్‌లో తూకం వేయాలి. మీరు డబ్బు కట్టిన తర్వాత ఇచ్చే బిల్లులో స్వచ్ఛత, బరువు, HUID నంబర్, తయారీ ఛార్జీలు, 3శాతం జీఎస్టీ వివరాలు కచ్చితంగా ఉన్నాయో లేదో చూసుకోండి. బిల్లు లేకపోతే ఇబ్బందుల్లో పడతారు..

4 / 5
నమ్మకమైన షాప్‌లోనే : BIS సర్టిఫైడ్ ఉన్న పెద్ద, పేరున్న జ్యువెలరీ షాపుల నుంచే కొనండి. పెద్ద బ్రాండ్లు పారదర్శకత మరియు సరైన డాక్యుమెంటేషన్‌ను పాటిస్తాయి. చిన్న, కొత్త షాపులలో మోసం జరిగే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా బంగారం కొనేముందు ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ నియమాలను పాటించడం ద్వారా బంగారం కొనుగోలును సురక్షితంగా, స్మార్ట్‌గా చేసుకోండి.

5 / 5
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!

భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!

సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..