Central Government: సామాన్యుల కోసం కేంద్రం అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. ఎలా పొందాలంటే..?

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో ఒకటి అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెల నెలా రూ.5 వేల పెన్షన్ పొందవచ్చు. అలాగే మరణిస్తే నామినీకి పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ వస్తుంది.

Central Government: సామాన్యుల కోసం కేంద్రం అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. ఎలా పొందాలంటే..?
Atal Pension Yojana

Updated on: Jun 17, 2026 | 11:23 AM

సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. వర్గాల వారీగా అనేక స్కీమ్స్ అమలు చేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుల కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి అమల్లో ఉంది. ఇందులో అతి తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా ప్రభుత్వం నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. వయస్సు దాటాక ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో కుటుంబ పోషణ కోసం స్థిరమైన ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో నెలా నెలా వచ్చే పెన్షన్ మీ ఆర్ధిక అవసరాలను తీర్చుతాయి. వృద్దాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారి కోసం కేంద్రం అద్బుతమైన పథకం అందుబాటులో ఉంచింది. అదే అటల్ పెన్షన్ యోజన.

నెలకు రూ.5 వేల పెన్షన్

అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ పొందే అవకాశముంది. మీరు కట్టే ప్రీమియంను బట్టి పెన్షన్‌ను నిర్ణయిస్తారు. రూ.వెయ్యి కావాలనుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. అదే రూ.5 వేల పెన్షన్ పొందాలనుకుంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 9 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఒకవేళ పెన్షన్ పొందే భర్త మరణిస్తే భార్యకు పెన్షన్ అందిస్తారు. భార్య కూడా చనిపోతే వారసులకు కార్పస్ ఫండ్ అందిస్తారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ బ్యాంకులు లేదా పోస్టాఫీసుకు వెళ్లి ఇందులో చేరవచ్చు. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారికి ఈ పథకంలో చేరేందుకు అర్హత లేదు.

ప్రీమియం ఎంతంటే..?

18 ఏళ్ల వయస్సులో చేరితే 60 ఏళ్ల వరకు చెల్లించాలి. అప్పుడు నెలకు ప్రీమియం రూ.42 నుంచి రూ.210 వరకు పడుతుంది. నెలకు రూ.5 వేల పెన్షన్ కావాలనుకుంటే రూ.210 కట్టాల్సలి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వయస్సులో చేరితే 20 ఏళ్లు కట్టాలి. అప్పుడు నెలకు రూ.291 నుంచి రూ.1454 వరకు ఉంటుది. రూ.5 వేల పెన్షన్ కావాలనుకుంటే రూ.1454 ప్రతీ నెలా చెల్లించాలి. ఇక భార్య, భర్త ఇద్దరూ చనిపోతే నామినీకి కార్పస్ వస్తుంది. వెయ్యి పెన్షన్ ఎంచుకుంటే రూ.1.70 లక్షలు, రూ.2 వేలు ఎంచుకుంటే రూ.3.40 లక్షలు, రూ.5 వేలు ఎంచుకుంటే రూ.8.50 లక్షల కార్పప్ అవసరం.

 

Follow Us