
కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. అనేక సేవింగ్స్, పెన్షన్ స్కీమ్‌లను తీసుకొస్తుంది. అందులో అటల్ పెన్షన్ యోజన పథకం ఒకటి. అసంఘటిత రంగంలోని పేదలు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకంలో కొంత మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలనెలా పింఛన్ పొందవచ్చు. ఒకవేళ చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామి, నామినీకి పింఛన్ సొమ్ము అందిస్తారు. అసలు ఈ పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హతలు ఏంటి..? ఎలా చేరాలి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
-కనీస వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి
-60 ఏళ్ల వయస్సు తర్వాత పింఛన్ మొదలవుతుంది
-నెలవారీగా లేదా ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు
-ప్రీమియం ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది
-60 సంవత్సరాలు వచ్చేంతవరకు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది
-ట్యాక్సులు చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు
మీరు ఏ వయస్సులో ఈ పథకంలో చేరుతున్నారు అనే విషయాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. మీకు 60 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్నారనేది ఎంపిక చేసుకునే దాని బట్టి కూడా ప్రీమియం ఉంటుంది. రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. 60 ఏళ్ల తర్వాత ఉద్యోగానికి రిటైర్మెంట్ అవుతారు. ఆ సమయంలో మీకు ఎలాంటి ఆదాయం ఉండదు. దీంతో అలాంటివారికి ఈ పింఛన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆదాయం పొందే సమయంలో డబ్బులు పొదుపు చేసుకుని వృద్దాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెపన్పవచ్చు.
-ప్రతీ బ్యాంకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌ను అమలు చేస్తోంది
-మీరు బ్యాంకులను సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు
-ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించిన ఆన్ లైన్ ద్వారా నమోదు కావొచ్చు. ఇక పోస్టాఫీస్ ద్వారా కూడా చేరవచ్చు.
-https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్ సైట్‌ను సందర్శించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
బ్యాంక్, పోస్టాఫీస్ అకౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్
60 ఏళ్లకు ముందే పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే జీవిత భాగస్వామి లేదా నామినీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జీవిత భాగస్వామికి నెలనెలా పెన్షన్ అందుతుంది.