Ashwini Vaishnaw: వినియోగదారుల రక్షణ కోసం టెలికాం సంస్కరణలు.. తుదిదశకు చేరాయన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

ఒకటి నిర్మాణాత్మక సంస్కరణ. రెండవది విధానపరమైన సంస్కరణ. తాము నిర్మాణ, విధానపరమైన భాగంలో చాలా ముఖ్యమైన అంశాలను తీసుకున్నామన్నారు. తాము ఇప్పుడు వినియోగదారుల రక్షణపై దృష్టి సారించినట్లుగా వైష్ణవ్ తెలిపారు. 

Ashwini Vaishnaw: వినియోగదారుల రక్షణ కోసం టెలికాం సంస్కరణలు.. తుదిదశకు చేరాయన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2023 | 1:59 PM

టెలికాం సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వినియోగదారుల రక్షణకు పెద్దపీఠ వేస్తున్నట్లుగా కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తమ ప్రభుత్వం సంస్కరణలను ఎల్లప్పుడూ రెండు కేటగిరీలుగా ఉంచుతుందన్నారు. ఒకటి నిర్మాణాత్మక సంస్కరణ. రెండవది విధానపరమైన సంస్కరణ. తాము నిర్మాణ, విధానపరమైన భాగంలో చాలా ముఖ్యమైన అంశాలను తీసుకున్నామన్నారు. తాము ఇప్పుడు వినియోగదారుల రక్షణపై దృష్టి సారించినట్లుగా వైష్ణవ్ తెలిపారు. పలు అంశాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. రెండు నెలల్లో సంస్కరణలు అందుబాటులోకి వస్తాయన్నారు. వినియోగదారుల భద్రతకు సంబంధించి మరిన్ని సంస్కరణలను ఎలా తీసుకురావాలనే దానిపై పరిశ్రమలతో కలిసి పని చేస్తున్నాట్లుగా వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.

కీలక సంస్కరణల్లో, ఒకే ఐడీపై జారీ చేసే సిమ్ కార్డుల సంఖ్యను ప్రస్తుత తొమ్మిది నుంచి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందని.. ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం, DoT 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రోల్‌అవుట్‌ను వేగవంతం చేయడానికి రైట్-ఆఫ్-వే (RoW) నిబంధనలను సరళీకృతం చేసింది.  5G రోల్‌అవుట్‌పై, టెలికాం పరిశ్రమ సుమారు రూ. 2.25 ట్రిలియన్ల పెట్టుబడి పెట్టిందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెలికాం కంపెనీలు 270,000 5G సైట్‌లను రూపొందించాయని వైష్ణవ్ అన్నారు.

టెలీమెడిసిన్‌కు పెద్ద పురోగమనం కాగల జీరో లేటెన్సీతో పూర్తిగా ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సెమీకండక్టర్ల తయారీకి సంబంధించి, మైక్రో టెక్నాలజీ యూనిట్‌కు మరో 40-45 రోజుల్లో శంకుస్థాపన చేయనున్నట్లు వైష్ణవ్ తెలిపారు. “అప్లైడ్ మెటీరియల్స్ ప్లాంట్, ఇది సుమారు $400 మిలియన్ పెట్టుబడి పెడుతోంది. వారు సైట్ తయారీలో కూడా పని చేయడం ప్రారంభించారు మరియు అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది, ”అని వైష్ణవ్ జోడించారు.

మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారో ఇక్కడ చూడండి..

మరిన్ని బిజినెస్ నూస్ కోసం