Credit Card Bill: మీ క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు

|

Mar 16, 2023 | 7:00 AM

చాలా మంది క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. గతంలో బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్‌ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది...

Credit Card Bill: మీ క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు
Credit Card
Follow us on

చాలా మంది క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. గతంలో బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్‌ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్‌ ద్వారానా వివరాలు తెలుసుకుని ఆధార్‌ వివరాలతో కార్డును జారీ చేస్తున్నాయి బ్యాంకులు. కానీ క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించకపోతే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కార్డు ఇచ్చిన తర్వాత కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు వాడితే బిల్లు చెల్లించే ముందు ఇబ్బందులు తలెత్తుతాయి.

చెల్లింపు గడువు తేదీ: ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడిన తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం బాకీ.. క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందులో పూర్తిగా చెల్లించకుండా సగం సగం చెల్లించినట్లయితే మీరు అప్పుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తంపై వడ్డీ విధిస్తాయి బ్యాంకులు. అలాగే మినిమమ్‌ బిల్లులు చెల్లించినా మీకు పెనాల్టీ విధిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

వడ్డీ లేకుండా.. బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో కస్టమర్‌కు 45-50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని ఇస్తారు. ఈ కాలంలో బకాయి మొత్తం అదనపు ఛార్జీ లేకుండా చెల్లించవచ్చు. కానీ ఆ సమయం దాటి బిల్లు చెల్లిస్తే మాత్రం 34 శాతం నుంచి 40 శాతం వరకు అధిక వడ్డీ రేటుతో చెల్లించుకోవాల్సి ఉంటుంది.

నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రస్తుతం కాలంలో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. కార్డును వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సమయానికి బిల్లు చెల్లించని పక్షంలో పెనాల్టీల మోత మోగుతుందని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..