Unclaimed Dividends: ఈక్విటీల్లో అన్‌క్లెయిమ్‌డ్‌ డివిడెండ్లు ఉన్నాయా? క్లెయిమ్‌ చేయడం చాలా ఈజీ..

పెట్టుబడిదారులు డివిడెండ్లను ఏడేళ్లకు పైగా క్లెయిమ్‌ చేయకుండా వదిలేస్తే వాటిని ఇన్వేస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీకు చెల్లించిన కంపెనీ బదిలీ చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ చేసిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా వార్షిక నివేదిక 2022-23 ప్రకారం క్లెయిమ్‌ చేయని డివిడెండ్లు మొత్తం 2021-22లో రూ.1539 కోట్ల నుంచి 2022-23 నాటికి రూ.1659 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క సంవత్సరంలో 8 శాతం అధికంగా అన్‌క్లెయిమ్‌ డివిడెండ్లు పెరిగాయి. ఈ

Unclaimed Dividends: ఈక్విటీల్లో అన్‌క్లెయిమ్‌డ్‌ డివిడెండ్లు ఉన్నాయా? క్లెయిమ్‌ చేయడం చాలా ఈజీ..
Cash

Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2023 | 7:01 AM

పెట్టుబడిదారులు తమ సొమ్మును ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత డివిడెండ్ల రూపంలో వారికి రివార్డులు వస్తాయి. డివిడెండ్లను కంపెనీకు వచ్చే లాభాల నుంచి కొంతశాతాన్ని పెట్టుబడిదారులకు ప్రకటిస్తారు. అయితే వీటి గురించి తెలియని వాళ్లు వాటిని క్లెయిమ్‌ చేయకుండా వదిలేస్తారు. పెట్టుబడిదారులు డివిడెండ్లను ఏడేళ్లకు పైగా క్లెయిమ్‌ చేయకుండా వదిలేస్తే వాటిని ఇన్వేస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీకు చెల్లించిన కంపెనీ బదిలీ చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ చేసిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా వార్షిక నివేదిక 2022-23 ప్రకారం క్లెయిమ్‌ చేయని డివిడెండ్లు మొత్తం 2021-22లో రూ.1539 కోట్ల నుంచి 2022-23 నాటికి రూ.1659 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క సంవత్సరంలో 8 శాతం అధికంగా అన్‌క్లెయిమ్‌ డివిడెండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ అన్‌క్లెయిమ్‌డ్‌ డివిడెండ్లను ఎలా క్లెయిమ్‌ చేయాలి? ఈ డివిడెండ్లు ఉన్నాయో? లేదో? ఎలా చెక్‌ చేయాలి? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

  • మీ డబ్బు కూడా ఐఈపీఎఫ్‌ఏతో క్లెయిమ్‌ చేయని డివిడెండ్లలో చిక్కుకుపోతే మీరు క్లెయిమ్‌ ఫైల్‌ చేయడం ద్వారా  డబ్బును తిరిగి పొందవచ్చు. కాబట్టి మీరు మీ క్లెయిమ్‌ చేయని డివిడెండ్లను ట్రాక్‌ చేయడం గురించి నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి డివిడెండ్లను ఎలా కనుక్కోవాలో? తెలుసుకుందాం.
  • పెట్టుబడికి సంబంధించిన పా పత్రాల పరిశీలించడం ద్వారా డివిడెండ్లను తెలుసుకోవచ్చు. షేర్‌ సర్టిఫికెట్లు, డివిడెండ్‌ వారెంట్లు వంటి పాత పెట్టుబడి పత్రాలను పరిశీలించాలి. 
  • షేర్లను కలిగి ఉండని కంపెనీల డివిడెండ్‌ క్రెడిట్‌ కోసం బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించాలి. అలాగే ఐఈపీఎఫ్‌కు బదిలీ చేసిన షేర్ల వివరాల కోసం డివిడెండ్‌ స్టేట్‌మెంట్లను తనిఖీ చేయాలి. 
  • ఏజీఎం నోటీసులు, డివిడెండ్‌ నోటిఫికేషన్లతో సహా మీ షేర్‌ హోల్డింగ్‌లకు సంబంధించిన కంపెనీల ఈ-మెయిల్స్‌ను తనిఖీ చేయాలి. 
  • క్లెయిమ్‌ చేయని షేర్లు డివిడెండ్ల కోసం శోధించడానికి కంపెనీ వెబ్‌సైట్‌లు, ఏకీకృత ఐఈపీఎఫ్‌ పోర్టల్‌ను తనిఖీ చేయాలి. 

క్లెయిమ్‌ చేయని డివిడెండ్లు తిరిగి పొందడం

క్లెయిమ్‌ చేయని షేర్లు, డివిడెండ్లు తిరిగి పొందడం కోసం కంపెనీ రిజిస్ట్రార్‌తో మీ క్లెయిమ్‌ చేయని కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేయాలి. మీ కేవైసీ వివరాలు నవీకరించిన తర్వాత కంపెనీ పెట్టుబడుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఒకవేళ క్లెయిమ్‌ చేయని డివిడెండ్లు  మరణించిన కుటుంబ సభ్యునికి చెందినవైతే చట్టపరమైన వారసులు ట్రాన్స్‌మిషన్‌ ప్రక్రియకు లోనవుతారు. కాబట్టి వారు చట్టపరమైన పత్రాలు అవసరం అవుతాయి. ఏడేళ్లుగా క్లెయిమ్‌ చేయని షేర్ల కోసం ఐఈపీఎఫ్‌ అథారిటీను సంప్రదించాలి.  

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..