ప్రస్తుత కాలంలో పెరిగిన ధరల దెబ్బకు సగటు మధ్యతరగతి ప్రజలు అప్పు తీసుకోకుండా సంసారాన్ని ఈదలేకపోతున్నారు. ముఖ్యంగా హౌస్ ఈఎంఐలు, పిల్లల చదువుకోసం తీసుకున్న లోన్లు, వాహనరుణాలు, గృహోపకరణాల కోసం తీసుకున్న రుణాలకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రుణ ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తే పర్లేదు కానీ ఏమైనా కొంచెం ఆలస్యమైతే లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. వారి ఆగడాలు ఎంతలా ఉంటాయంటే ఏ సమయంలోనైనా వచ్చి గొడవ చేయడం లేదా వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా లోన్ రికవరీ ఏజెంట్లు తరచూ రుణగ్రహీతలను, వారి కుటుంబాలను అవమానించడం, బెదిరింపులు, మానసిక, శారీరక వేధింపులకు గురిచేసి డబ్బును తిరిగి పొందుతుంటారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల కోసం కఠినమైన మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. అయితే వీటిని ఎవరూ పాటించరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే లోన్ రికవరీ కోసం కాల్ చేయాలి. అలాగే వారు అవమానకరమైన సందేశాలను పంపకూడదు లేదా రుణగ్రహీతను శారీరకంగా/మానసికంగా వేధించకూడదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే రుణగ్రహీతలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. అలాగే రికవరీ ఏజెంట్లకు వ్యతిరేకంగా వారు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. లోన్ రికవరీ ఏజెంట్లపై రుణగ్రహీతలు ఎలా ఫిర్యాదు చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఈ పద్ధతులు వేధింపుల నుంచి ఎటువంటి ఉపశమనాన్ని అందించకపోతే, రుణగ్రహీత నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించవచ్చు. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని రికవరీ ఏజెంట్లను కొంత కాలం పాటు నిమగ్నం చేయకుండా రుణదాతని సెంట్రల్ బ్యాంక్ నిరోధించవచ్చు. నిరంతర ఉల్లంఘనల విషయంలో ఆర్‌బీఐ నిషేధం వ్యవధి, పరిధిని పొడిగించవచ్చు. రికవరీ ఏజెంట్ల వంటి సర్వీస్ ప్రొవైడర్ల చర్యలకు నియంత్రిత సంస్థలు బాధ్యత వహిస్తాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరియు ఆల్-ఇండియా ఆర్థిక సంస్థల వంటి సహకార బ్యాంకుల వంటి అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం