మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కృతమైంది. ఇటీవల జరిగిన భారత్ జీపీలో దీనిని విడుదల చేశారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఎప్రిలియా ఆర్ఎస్457. పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్న కేటీఎం ఆర్సీ 390, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కవాసకి నింజా 400 వంటి బైక్ లకు పోటీగా దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఇటాలియన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ ఎప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ మన దేశంలో లాంచ్ అయ్యింది. రూ. 4.10లక్షలు(ఎక్స్ షోరూం) ధరతో గోవాలో జరిగిన ఇండియన్ బైక్ ఫెస్టివల్ లో దీనిని ఆవిష్కరించారు. ఈ కొత్త మోటార్ సైకిల్ లాంచింగ్ ముందే పలువురి అటెన్షన్ డ్రా చేసింది. ఎందుకంటే ఈ ఇటాలియన్ బ్రాండ్ తొలిసారి పూర్తి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా ఈ బైక్ ను లాంచ్ చేసింది.
ఎప్రిలియా ఆర్ఎస్457 పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తుంది. డిజైన్ విషయంలో ఇప్పటికే ఉన్న ఆర్ఎస్660, ఆర్ఎస్ వీ4 వంటి వాటికి దగ్గరగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ స్లీక్, షార్ప్, స్పోర్ట్ డిజైన్ లో వస్తుంది. మంచి అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది. ఎరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్. చూడటానికి మంచి ఇప్రెసివ్ లుక్లో అదరగొడుతుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఎప్రిలియా ఆర్ఎస్457 5 అంగుళాల కలర్డ్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మల్టీ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ క్విక్ షిఫ్టర్. ఈ స్పోర్ట్స్ బైక్ లో మెకానిజం గమనిస్తే.. ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్, యూఎస్డీ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ ఉంటుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ డ్యూయల్ చానల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. బాడీ ధృడంగా ఉంటుంది.
ఎప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ లో 457సీసీ లిక్విడ్ కూల్డ్ పారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. మొత్తం బండి బరువు 159కేజీలు ఉంటుంది. ఈ బైక్ కి పవర్ టు వెయిట్ రేషియో ఉంటుంది. ఓవరాల్ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. రైడర్ కు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..