
ఆపిల్ సాంప్రదాయం ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య విడుదల కానుందని లీక్స్ సూచిస్తున్నాయి. ప్రీ-ఆర్డర్లు లాంచ్ తర్వాత వెంటనే ప్రారంభమవుతాయి. అంటే సెప్టెంబర్ చివరి నాటికి ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఐఫోన్ 17 ధర భారత్‌లో సుమారు రూ.89,990 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ.90,000 నుంచి రూ.1,19,999 వరకు ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,29,999, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర రూ.1,44,900 నుంచి రూ.1,69,990 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు డిజైన్ అప్‌గ్రేడ్‌లు ఇంపోర్ట్ టాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఐఫోన్ 17 మరియు ఐఫోన్ 17 ఎయిర్ మోడళ్లలో ఆపిల్ కొత్త A19 చిప్‌సెట్ ఉపయోగించబడుతుందని, అయితే ఐఫోన్ 17 ప్రో మరియు ప్రో మాక్స్ మోడళ్లలో మరింత శక్తివంతమైన A19 ప్రో చిప్‌సెట్ ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిప్‌సెట్‌లు 3nm ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటాయి. ఇది అద్భుతమైన పనితీరు మరియు బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రో మోడళ్లలో 12GB RAM, స్టాండర్డ్ మోడళ్లలో 8GB RAM ఉండవచ్చని సమాచారం.
డిస్‌ప్లేలో ఈ సారి అన్ని ఐఫోన్ 17 మోడళ్లు 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేలతో వస్తాయని లీక్స్ సూచిస్తున్నాయి, ఇది గతంలో కేవలం ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితమైంది. ఐఫోన్ 17 ఒక 6.3-ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను, ఐఫోన్ 17 ఎయిర్ 6.6-ఇంచ్ డిస్‌ప్లేను, ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-ఇంచ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ 5.5mm మందంతో అత్యంత సన్నని ఐఫోన్‌గా నిలవనుంది. అలాగే LTPO OLED టెక్నాలజీతో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుందని అంచనా.
కెమెరా ఫీచర్లు ఐఫోన్ 17 సిరీస్‌లో కెమెరా అప్‌గ్రేడ్‌లు ఆకర్షణీయంగా ఉండనున్నాయి. అన్ని మోడళ్లలో 24MP ఫ్రంట్ కెమెరా, 48MP రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ప్రో మోడళ్లలో 48MP టెలిఫోటో లెన్స్ హైబ్రిడ్ రియర్ ప్యానెల్ డిజైన్ ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి. అదనంగా, ఆపిల్ యొక్క కొత్త 5G మోడెమ్ , వై-ఫై 7 సపోర్ట్‌తో కనెక్టివిటీ మెరుగవుతుంది. ఐఫోన్ 17 సిరీస్ ఆపిల్ అభిమానులకు కొత్త డిజైన్, అధునాతన టెక్నాలజీ అద్భుతమైన పనితీరును అందించనుందని సమాచారం..ఆపిల్ అధికారిక ప్రకటనతో రానున్న రోజుల్లో ఆపిల్ 17 సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.