Apple CEO Tim: తమిళ విద్యార్థులపై యాపిల్ సీఈవో ప్రశంసల ట్వీట్.. ఎందుకో తెలుసా..!

Apple CEO Tim: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమిళనాడుకు చెందిన విద్యార్థులకు ట్విట్టర్ ద్వారా అభినందించారు. గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్‌లో అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్.

Apple CEO Tim: తమిళ విద్యార్థులపై యాపిల్ సీఈవో ప్రశంసల ట్వీట్.. ఎందుకో తెలుసా..!
Tim Cook

Updated on: Mar 27, 2022 | 8:09 AM

Apple CEO Tim: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమిళనాడుకు చెందిన విద్యార్థులకు ట్విట్టర్ ద్వారా అభినందించారు. గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్‌లో అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్. ఐఫోన్ 13 మినీ(Apple iPhone 13 Mini) నుంచి కొన్ని అద్భుతమైన ఫోటోగ్రాఫ్‌లను తీసిన తమిళనాడు విద్యార్థులపై టిమ్ కుక్ విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులు తీసిన ఫోటోలు ఇప్పుడు చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియంలో 17 ఏప్రిల్ 2022 వరకు ప్రదర్శించబడుతున్నాయని కుక్ తన ట్వీట్‌లో తెలిపారు. తమిళనాడుకు(Tamilnadu) చెందిన 40 మంది విద్యార్థులు ఈ ఫోటోలను తీశారు. భారతదేశంలోని తమిళనాడుకు చెందిన 40 మంది హైస్కూల్ విద్యార్థులు ఐఫోన్ 13 మినీలో తమ కమ్యూనిటీల వైబ్రేషన్‌ను క్యాప్చర్ చేశారని కుక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. “ఇప్పుడు వారు చేసిన పని చెన్నై లోని చారిత్రాత్మకమైన ఎగ్మోర్ మ్యూజియంలో ప్రదర్శించబడింది” అంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్‌తో పాటు, కుక్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న వాటిలోని రెండు ఫొటోలను పంచుకున్నారు. అతను తన ట్వీట్‌తో “#ShotoniPhone” ట్యాగ్‌ని ఉపయోగించాడు. iPhone 13 Mini డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో 12-మెగాపిక్సెల్, 12-మెగాపిక్సెల్ (అల్ట్రావైడ్) లెన్స్ ఉన్నాయి. వినియోగదారులు Apple iPhone 13 Miniని ఉపయోగించి 60 fps వద్ద 4K వరకు డాల్బీ విజన్‌తో HDR వీడియోను కూడా షూట్ చేయవచ్చు. ఎగ్జిబిషన్‌ని సందర్శించి.. మా విద్యార్థి కళాకారుల లెన్స్‌ల ద్వారా తమిళనాడును చూడండంటూ చెన్నై ఫోటో బినాలే ఫౌండేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. షోకేస్‌కు దారితీసే వర్క్‌షాప్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ఎగ్జిబిషన్ వారాంతపు మార్గదర్శక పర్యటనల కోసం మాతో చేరాలంటూ సంస్థ కోరింది.

ఇవీ చదవండి..

Microsoft: ఒప్పందాల కోసం మైక్రోసాఫ్ట్ ముడుపులు.. సంచలన కామెంట్స్ చేసిన ఆ ఉద్యోగి..!

Sachin Wife Viral: అడవీలో పులులలో సరదాగా సచిన్ భార్య.. వైరల్ అవుతున్న వీడియో..!