Price Increase: నూతన సంవత్సరంలో ధరల మోత.. పెరగనున్న పలు నిత్యావసర వస్తువులు, వాహనాల ధర..

|

Dec 25, 2021 | 4:05 PM

కొత్త సంవత్సరంలో ఎడిబుల్ ఆయిల్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ముడిసరుకు ధర పెరగడంతో ఈ కంపెనీలు 2021 సంవత్సరంలో ధరలను రెండు-మూడు సార్లు పెంచాయి...

Price Increase: నూతన సంవత్సరంలో ధరల మోత.. పెరగనున్న పలు నిత్యావసర వస్తువులు, వాహనాల ధర..
Price
Follow us on

కొత్త సంవత్సరంలో ఎడిబుల్ ఆయిల్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ముడిసరుకు ధర పెరగడంతో ఈ కంపెనీలు 2021 సంవత్సరంలో ధరలను రెండు-మూడు సార్లు పెంచాయి. వచ్చే సంవత్సరం మరింత పెంచనున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తుల ధరలను 4-10 శాతం పెరుగొచ్చని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పటికే డిసెంబర్ నెలలో ధరలను 3-5 శాతం ధరలు పెంచాయి. ఈ నెలలో ఫ్రీజ్, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్ ధరలు పెరిగాయి. వీటి ధరలు ఇంకా 10 శాతం పెరగవచ్చని తెలుస్తోంది.

ద్రవ్యోల్బణం ప్రభావం ఆటో రంగంపై కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది ఆటో కంపెనీలు పలుమార్లు వాహనాల ధరలను పెంచాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచాయి. 2022లో కూడా ధరలను పెంచనున్నట్లు మారుతీ, హీరో మోటోకార్ప్‌లు తెలిపాయి.

హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, బ్రిటానియా, మారికో వంటి కంపెనీలు గత రెండు త్రైమాసికాల్లో ధరలను 5-12 శాతం పెంచాయి. మార్చి త్రైమాసికం నాటికి వాటి ధరల్లో 5-10 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పటికే ధరలను 4 శాతం పెంచినట్లు డాబర్ కంపెనీ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు.

నీల్సన్ సర్వే నివేదిక ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో FMCG మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేసింది. ధరల పెరుగుదల కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది. 12 శాతం వృద్ధిలో 90 శాతం ధరల సవరణ ద్వారా వచ్చింది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

ఇన్‌పుట్ కాస్ట్ 22-23 శాతం పెరిగిందని కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమలకు చెందినవారు చెబుతున్నారు. ఉక్కు, రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్, ఇతర భాగాల ధరల పెరుగుదల కారణంగా ఇన్‌పుట్ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ కాంపోనెంట్‌ల ధర ప్రస్తుతం అత్యధిక స్థాయిలో ఉంది. ఇది కాకుండా, సముద్రం ద్వారా ముడి సరుకు రవాణా ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. సరఫరా చేసే కంటైనర్ కొరత కారణంగా, కంటైనర్ ధర గణనీయంగా పెరిగింది. దీంతోపాటు ముడిచమురు ధర, ప్యాకేజింగ్ ఖర్చు కూడా పెరిగింది.

Read Also.. Debit Card: మీరు డెబిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..