EV Scooter: మార్కెట్‌లోకి మరో కొత్త ఈవీ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే అదిరిపోతారంతే

ఈవీ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో ఈవీ వాహనాల కొనుగోలు మధ్యతరగతి ప్రజలు దూరం అవుతున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి స్టార్టప్ కంపెనీలు తక్కువ ధరలోనే ఈవీ స్కూటర్లను అందిస్తున్నాయి. ఈ కోవలో ప్రముఖ ఈవీ కంపెనీ గ్రేటా హార్పర్ కొత్త మోడల్ ఈవీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

EV Scooter: మార్కెట్‌లోకి మరో కొత్త ఈవీ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే అదిరిపోతారంతే
Greta Harper Zx Electric Scooter
Follow us
Srinu

| Edited By: Madhu

Updated on: Apr 29, 2023 | 2:49 PM

ప్రస్తుతం భారతదేశంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా కంపెనీలు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ మోటర్ కంపెనీల వరకూ ఈవీ జపమే చేస్తున్నాయి. ప్రజలు కూడా పెరుగుతున్న పెట్రో ధరల దెబ్బకు ఈవీ వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈవీ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో ఈవీ వాహనాల కొనుగోలు మధ్యతరగతి ప్రజలు దూరం అవుతున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి స్టార్టప్ కంపెనీలు తక్కువ ధరలోనే ఈవీ స్కూటర్లను అందిస్తున్నాయి. ఈ కోవలో ప్రముఖ ఈవీ కంపెనీ గ్రేటా హార్పర్ కొత్త మోడల్ ఈవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 41,999 (ఎక్స్-షోరూమ్) అని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాటరీ లేకుండా కొత్త మోడల్ అయిన గ్రేటా హార్పర్ జెడ్ఎక్స్ సిరీస్-Iని పరిచయం చేసింది. బ్యాటరీ, ఛార్జర్ విడివిడిగా తర్వాత అందిస్తారని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే వినియోగదారులు స్కూటర్‌కు సరిపోయేలా వాటి వినియోగం ఆధారంగా ఎంచుకోవచ్చు.  ప్రస్తుతం గ్రేటా హార్పర్ స్కూటర్ స్పెసిఫికేషన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

బ్యాటరీ, మోటర్

ఈ ఈవీ స్కూటర్‌లో 48–60 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీలతో నడిచే బ్రష్‌లెస్ డీసీ మోటార్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే మూడు గంటల్లో 0-80% ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్‌ను ఎకో మోడ్లో రైడ్ చేస్తే అత్యధిక ట్రిమ్‌లో ఛార్జీల మధ్య 100 కిలోమీటర్లు అందిస్తుంది, అయితే సిటీ, టర్బో మోడ్స్‌లో రైడ్ చేస్తే 80- 70 కిలోమీటర్లు మైలేజ్ అందిస్తుంది.

స్పెసిఫికేషన్లు ఇవే

ఈ గ్రేటా హార్పర్‌ ఈవీ స్కూటర్‌లో యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్, ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై వెహికల్ అలారం, యూఎస్‌బీ పోర్ట్ వంటి కొన్ని సౌకర్యాలతో ఈ స్కూటర్ వస్తుంది. అలాగే ట్యూబ్ లెస్ టైర్లతో వచ్చే ఈ స్కూటర్ మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని కంపెనీ వర్గాలు హామినిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే