Advance Tax: ఆ పన్ను చెల్లింపుదారులకు మరో అలెర్ట్.. ముంచుకొస్తున్న గడువు ముప్పు

|

Sep 12, 2024 | 6:16 PM

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. అయితే కొంతమంది పౌరులు వారి ఆదాయాన్ని అంచనా వేసుకుని ముందస్తు పన్ను చెల్లింపులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాపారస్తులు వ్యాపారాలు వారి అంచనా వేసిన వార్షిక పన్ను బాధ్యతలో 45% చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు పన్ను విధానం, ఏడాది పొడవునా ప్రభుత్వానికి స్థిరమైన రాబడి వచ్చేలా రూపొందించారు.

Advance Tax: ఆ పన్ను చెల్లింపుదారులకు మరో అలెర్ట్.. ముంచుకొస్తున్న గడువు ముప్పు
Income Tax
Follow us on

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. అయితే కొంతమంది పౌరులు వారి ఆదాయాన్ని అంచనా వేసుకుని ముందస్తు పన్ను చెల్లింపులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాపారస్తులు వ్యాపారాలు వారి అంచనా వేసిన వార్షిక పన్ను బాధ్యతలో 45% చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు పన్ను విధానం, ఏడాది పొడవునా ప్రభుత్వానికి స్థిరమైన రాబడి వచ్చేలా రూపొందించారు. ఈ నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు ముఖ్యంగా వ్యాపారం, వడ్డీ లేదా జీతం కంటే మూలధన లాభాల నుండి గణనీయమైన ఆదాయం ఉన్నవారు ఈ చెల్లింపులను నాలుగు వాయిదాలలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోపు చెల్లింపులు చేయకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలను కచ్చితంగా సమయానికి లెక్కించి పన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో విడత ముందస్తు పన్ను చెల్లింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

2024-25 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను మొదటి విడత జూన్ 15, 2024న ముగిసింది. ఒకటో వాయిదాలో పన్ను బాధ్యతలో 15 శాతం చెల్లించాల్సి ఉంటుది. రెండో 15 సెప్టెంబర్‌తో గడువు ముగుస్తుంది. రెండో విడతలో మొత్తం ముందస్తు పన్ను బాధ్యతలో 45 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మూడో విడత సమయం డిసెంబర్ 15న ముగుస్తుంది. ఈ చెల్లింపు మొత్తం ముందస్తు పన్ను బాధ్యతలో 75 శాతంగా ఉంటుంది. నాలుగో వాయిదా మార్చి 15తో ముగుస్తుంది. మొత్తం ముందస్తు పన్ను బాధ్యతలో 100 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 208 ప్రకారం సంవత్సరానికి రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యతను అంచనా వేసిన ప్రతి వ్యక్తి తన పన్నును ‘అడ్వాన్స్ ట్యాక్స్’ రూపంలో ముందుగానే చెల్లించాలి. ఇదే నియమం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, వన్ పర్సన్ కంపెనీలతో సహా అన్ని రకాల కంపెనీలకు వర్తిస్తుంది.

ఓ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల అంచనా మొత్తం ఆదాయంపై ముందస్తు పన్ను లెక్కిస్తారు. ఇది జీతం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు మొదలైన అన్ని మూలాల నుండి వచ్చే ఆదాయాన్ని కలిగి ఉంటుంది. ముందుగా ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయాన్ని అంచనా వేయాలి. వర్తించే ఆదాయపు పన్ను రేట్ల ప్రకారం ఈ అంచనా ఆదాయంపై ఆదాయపు పన్నును లెక్కించాలి. మూలం వద్ద మినహాయించబడిన పన్ను (టీడీఎస్)తో పాటు ఏవైనా ఇతర క్రెడిట్‌లను అంచనా వేసిన పన్ను బాధ్యత నుండి తీసివేయాలి. అనంతం మిగిలిన మొత్తాన్ని ముందస్తు చెల్లింపుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ముందస్తు పన్నును చెల్లించడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..