Anand Mahindra: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో వచ్చే ఆసక్తికర అశాంలపై స్పందిస్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా.. ఓ రష్యాకు సంబంధించిన న్యూస్ పై ట్విట్టర్ లో స్పందించారు. అదేంటంటే రష్యాలోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డు విధుల్లో బోర్ కొట్టడంతో.. ఓ ఖరీదైన పెయింటింగ్ పై పెన్నుతో తన పనితనాన్ని చూపాడు. ఆ పెయింటింగ్ లకు కళ్లు గీశాడు. ఇంకేముంది ఈ పనితో సదరు సంస్థ ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ న్యూస్ పై స్పందించిన ఆనంద్ మహీంద్రా దీనికి ఆందోళన చెందడం దేనికి.. కొత్తగా తయారైన కళాఖండాన్ని ఎన్‌ఎఫ్‌టిగా మార్చేయమంటూ బదులుగా ట్వీట్ చేశారు.
Why worry? Just convert the new ‘creation’ into an NFT! https://t.co/I7F3wbIxWH
— anand mahindra (@anandmahindra) February 10, 2022
తరువాత రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. సెక్యూరిటీ గార్డు చేసిన పని వల్ల ఆ కళాఖండాలకు.. రూ. రెండు లక్షల వరకూ నష్టం జరిగినట్లు తేల్చారు. కానీ.. ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే సదరు పెయింటింగ్ లపై సుమారు రూ. ఏడున్నర కోట్లు బీమా ఉందని తేలుసుకున్న అధికారులు అవాకయ్యారు. దీంతో ఉద్యోగి చేసిన తప్పుకు బాధ్యతవహించిన సదరు సెక్యూరిటీ సంస్థ.. జరిగిన నష్టాన్ని భర్తీ చేసే పనిలో పడింది. ప్రస్తుతం కళాఖండాలకు పూర్వవైభవం తెచ్చే పనిలో నిపుణులు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
Digital Rupee: డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుంది..? పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం..