RD Scheme: రూ.1.2 లక్షల పెట్టుబడితో రూ.17 లక్షల రాబడి.. ఆ పోస్టాఫీస్ పథకంతోనే సాధ్యమే..!

|

Oct 13, 2024 | 6:45 PM

భారతదేశంలోని ప్రజలు ఏళ్లుగా సురక్షిత పెట్టుబడి మార్గంగా పోస్టాఫీసు పథకాలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఏళ్లుగా భారతీయుల పొదుప ప్రయాణంలో పోస్టాఫీసు పథకాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో పథకాల్లో పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నా పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడిని ఇష్టపడతారు. ముఖ్యంగా పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా కాలంగా ప్రజాదరణ పొందుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.

RD Scheme: రూ.1.2 లక్షల పెట్టుబడితో రూ.17 లక్షల రాబడి.. ఆ పోస్టాఫీస్ పథకంతోనే సాధ్యమే..!
Follow us on

భారతదేశంలోని ప్రజలు ఏళ్లుగా సురక్షిత పెట్టుబడి మార్గంగా పోస్టాఫీసు పథకాలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఏళ్లుగా భారతీయుల పొదుప ప్రయాణంలో పోస్టాఫీసు పథకాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో పథకాల్లో పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నా పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడిని ఇష్టపడతారు. ముఖ్యంగా పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా కాలంగా ప్రజాదరణ పొందుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే మీకు హామీతో కూడిన రాబడిని కూడా అందిస్తుంది. అయితే రికరింగ్ డిపాజిట్‌లో రూ.1.2 లక్షల పెట్టుబడితో రూ.17 లక్షల రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశం అంతటా ప్రజలు పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్వహించే ఆర్‌డీ స్కీమ్ పథకాన్ని అమితంగా ఇష్టపడుతుననారు. ఈ పథకంలో పెట్టుబడి ఎలాంటి రిస్క్ ఉండదు. నిర్దిష్ట సమయం పూర్తయ్యాక మీకు హామీతో కూడిన రాబడిని కూడా అందిస్తుంది. ఈ పథకంలో మీరు ప్రతి నెలా తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీరు ఏ నెలా చెల్లించకపోతే మీరు 1 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ స్కీమ్‌లో వరుసగా 4 నెలల పాటు ఇన్వెస్ట్ చేయకపోతే ఈ స్కీమ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. మీరు పోస్టాఫీసు ఆర్‌డి పథకం కింద ఖాతాను తెరవాలనుకుంటే మీరు తక్కువ మొత్తం మాత్రమే చెల్లించాలి. ఈ పథకం కోసం, మీరు కనీసం 100 రూపాయలు చెల్లించి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ అద్భుతమైన పథకంతో మీరు ప్రతి సంవత్సరం 6.8 శాతం వడ్డీ అందిస్తారు. ఈ పథకం వ్యవధి ఐదు ​​సంవత్సరాలు, మీకు కావాలంటే ఈ పథకం మెచ్యూరిటీ తర్వాత కూడా మీరు మరింత కొనసాగించవచ్చు.

మీరు పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్‌ను తెరిచి మీరు లక్షల రూపాయలు తిరిగి పొందాలనుకుంటే మీరు మీ ఆర్థిక ప్రణాళికను ప్లాన్ చేసుకోవాలి. ఈ పథకం కింద ప్రతిరోజూ రూ.333 పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.10,000 సంపాదించవచ్చు. అదేవిధంగా మీరు పోస్టాఫీసు ఆర్‌డీ పథకంలో ఏటా రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆర్‌డీ పథకం 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయినప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 599400 అవుతుంది. దానిపై మీరు ప్రభుత్వం నిర్ణయించిన 6.8 శాతం వడ్డీని అందిస్తే రూ. 115427 వస్తుంది. ఇప్పుడు మీరు పొందే మొత్తం 5 సంవత్సరాలకు రూ.714827 అవుతుంది. మీరు మీ ఆర్‌డీ పథకాన్ని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగిస్తే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 12,00,000 అవుతుంది. ఈ మొత్తంపై మీరు 6.8 శాతం రేటుతో మొత్తం రూ. 5,08,546 వడ్డీని పొందుతారు. 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీరు పొందే మొత్తం రూ. 17,08,546 అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి