Gold loans: లోపాలు సరిదిద్దుకోండి.. గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలకు ఆర్బీఐ వార్నింగ్..

ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దానిపై బ్యాంకులు ఇచ్చే రుణ పరిమాణం కూడా ఎక్కువైంది. బ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చే రుణాలలో ఎక్కువగా బంగారం మీద ఇచ్చేవే అధికంగా ఉంటున్నాయి. అయితే కొన్ని సంస్థలు బంగారం రుణాల విషయంలో నిబంధనలు పాటించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. ఆ లోపాలను సరిదిద్దుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Gold loans: లోపాలు సరిదిద్దుకోండి.. గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలకు ఆర్బీఐ వార్నింగ్..
Gold Loans
Follow us

|

Updated on: Oct 13, 2024 | 5:49 PM

సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి మార్గాలలో బంగారం కొనుగోలు ఒకటి. దీని ధర పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ తగ్గదు. అందుకే చాలామంది తమ డబ్బులను బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి నెలా చేసిన పొదుపుతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే అత్యవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలా చూసినా బంగారం కొనుగోలు వల్ల ప్రయోజనమే కానీ నష్టం ఉండదు. ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దానిపై బ్యాంకులు ఇచ్చే రుణ పరిమాణం కూడా ఎక్కువైంది. బ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చే రుణాలలో ఎక్కువగా బంగారం మీద ఇచ్చేవే అధికంగా ఉంటున్నాయి. అయితే కొన్ని సంస్థలు బంగారం రుణాల విషయంలో నిబంధనలు పాటించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. ఆ లోపాలను సరిదిద్దుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

అవకతవకలు..

ఆర్బీఐ సెప్టెంబర్ 30వ తేదీన ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్నిగోల్డ్ లోన్ సంస్థలు బంగారు ఆభరణాల రుణాలను మంజూరు చేసే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా మదింపు, డ్యు డిలిజెన్స్, ఎండ్ యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్ లు వాల్యూ (ఎల్ టీవీ) మానిటరింగ్, రిస్క్ వెయిట్ అప్లికేషన్ లో గణనీయమైన లోపాలు ఉన్నట్టు స్పష్టం చేసింది. వీటిని మూడు నెలల్లో సరిచేసుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

జాగ్రత్త అవసరం..

బంగారు రుణాలు తీసుకునేవారు కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ఆర్బీఐ ఆమోదించిన రుణదాతల వడ్డీరేట్లు, చార్జీలను గమనించాలి. దాని ద్వారా మీకు వీలుగా ఉండే రుణదాతను ఎంచుకునే వీలుంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్ టెక్ రుణదాతలు ప్రకటించిన ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి. వాటి వెనుక కొన్ని కఠినమైన నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం రుణాల విషయంలో వడ్డీరేట్లు, చార్జీలు, వాయిదాల విషయంలో తేడాలు ఉంటే అవకాశం ఉంది. కాబట్టి రుణం తీసుకునే ముందే రుణదాతపై అవగాహన పెంచుకోవాలి. నిబంధనలను పూర్తిగా తెలుసుకుని, ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకోవాలి.

బంగారు రుణాలపై వడ్డీరేట్లు..

బంగారం రుణాలపై బ్యాంకులు వివిధ రకాల వడ్డీరేట్లు వసూలు చేస్తున్నాయి. ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా 8.80 శాతం చొప్పున, కోటక్ మహీంద్ర బ్యాంకు 9 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 9.10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 9.15 శాతం, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు 9.25 శాతం, యూనియన్ బ్యాంకు 9.95 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 10.20 శాతం, యాక్సిస్ బ్యాంకు 17 శాతం వడ్డీ విధిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లోపాలు సరిదిద్దుకోండి.. ఆ సంస్థలకు ఆర్బీఐ వార్నింగ్..
లోపాలు సరిదిద్దుకోండి.. ఆ సంస్థలకు ఆర్బీఐ వార్నింగ్..
బాబోయ్‌ రైలు ప్రయాణం..! గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు..
బాబోయ్‌ రైలు ప్రయాణం..! గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు..
IND v AUS మ్యాచ్.. సెమీస్ బెర్త్ కోసం ఎన్ని రన్స్ తో గెలవాలంటే?
IND v AUS మ్యాచ్.. సెమీస్ బెర్త్ కోసం ఎన్ని రన్స్ తో గెలవాలంటే?
గేమర్స్ కోసం బెస్ట్ డీల్స్.. టాప్ ట్యాబ్లెట్స్‌పై బంపర్ ఆఫర్స్..
గేమర్స్ కోసం బెస్ట్ డీల్స్.. టాప్ ట్యాబ్లెట్స్‌పై బంపర్ ఆఫర్స్..
వైట్ బ్రెడ్ - బ్రౌన్ బ్రెడ్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది..?
వైట్ బ్రెడ్ - బ్రౌన్ బ్రెడ్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది..?
రత్నంలాంటి టాటాకు వినూత్న నివాళి..11వేల వజ్రాలతో ధగధగలాడే చిత్రం
రత్నంలాంటి టాటాకు వినూత్న నివాళి..11వేల వజ్రాలతో ధగధగలాడే చిత్రం
బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
సింగిల్ చార్జ్ పై ఏకంగా 170 కిలోమీటర్లు.. పైగా రూ. 10వేల వరకూ..
సింగిల్ చార్జ్ పై ఏకంగా 170 కిలోమీటర్లు.. పైగా రూ. 10వేల వరకూ..
ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!