Amul Butter: అమూల్‌కు వెన్న కొరత.. అసలు కారణాలు వెల్లడించిన కంపెనీ

|

Dec 03, 2022 | 8:52 PM

డైరీ దిగ్గజం అమూల్ తన వెన్న కొరతను అధిగమించడానికి ఉత్పత్తిని పెంచింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్..

Amul Butter: అమూల్‌కు వెన్న కొరత.. అసలు కారణాలు వెల్లడించిన కంపెనీ
Amul Butter
Follow us on

డైరీ దిగ్గజం అమూల్ తన వెన్న కొరతను అధిగమించడానికి ఉత్పత్తిని పెంచింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ.. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగల సీజన్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండటమే ఈ కొరతకు కారణమని సోధీ చెప్పారు.

కొరతకు కారణం ఏమిటి?

లంపి స్కిన్ వ్యాధి కూడా దీనికి కారణమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇది గేదెలు, దూడలలో చాలా వేగంగా వ్యాపించే వైరల్ వ్యాధి అని అన్నారు. దీంతో పాటు జంతువులకు మేత కొరత కూడా ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్‌-నవంబర్‌లో డిమాండ్‌ తగ్గుముఖం పట్టిందని, ఉత్పత్తి సరఫరాలో సమస్యలతో సహా అతను దీని వెనుక అనేక కారణాలను తెలిపారు.

పాల ధరలను పెంచే ఆలోచన కంపెనీకి లేదు:

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ , అమూల్ బ్రాండ్‌తో పాలను వ్యాపారం చేసే సహకార సంస్థ సమీప భవిష్యత్తులో దేశంలో పాల ధరలను పెంచే ఆలోచన లేదని కంపెనీ తెలిపింది. జీసీఎంఎంఎఫ్‌ ప్రధానంగా గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పశ్చిమ బెంగాల్, ముంబై మార్కెట్లలో పాలను విక్రయిస్తుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోధి తెలిపారు. ఈ సహకార సంస్థ రోజుకు 150 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తుంది. అందులో 40 లక్షల లీటర్ల పాలను ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్టోబరులో జీసీసీఎంఎంఎఫ్‌ అముల్ గోల్డ్ (పూర్తి క్రీమ్), గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో మినహా మిగిలిన అన్ని మార్కెట్‌లలో ఈ వృద్ధి కనిపించింది. డిసెంబర్ తొలివారంలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ధరల పెరుగుదల తర్వాత అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.61 నుండి రూ.63కి పెరగగా, గేదె పాల ధర లీటరుకు రూ.63 నుండి రూ.65కి పెరిగింది.

ఈ ఏడాది అమూల్ పాల ధరలను మూడు సార్లు పెంచగా, మదర్ డెయిరీ నాలుగు సార్లు పెంచింది. రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా అమ్మకాల పరిమాణంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మదర్ డెయిరీ ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..