Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!

Amul Milk Peice Hikes: దేశంలోనే అతిపెద్ద పాల కంపెనీ అయిన అమూల్ మే 14వ తేదీ నుంచి ధరలను పెంచబోంది. ఇప్పటికే నిత్యావసరాల వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి షాకివ్వనుంది. ద్రవ్యోల్బణం మరోసారి సామాన్యుడి జేబుపై భారం మోపుతోంది. పెరిగిన పాల..

Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!
Amul Milk

Updated on: May 13, 2026 | 7:17 PM

Amul Milk Peice Hikes: నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడికి ప్రముఖ డెయిరీ దిగ్గజం అమూల్ (Amul) షాకిచ్చింది. దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచుతూ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మే 14, 2026 (గురువారం) నుండి అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

ఇవి కూడా చదవండి

లీటరుకు రూ. 2 పెంపు

అమూల్ గోల్డ్, అమూల్ ఫ్రెష్‌, అమూల్ శక్తి, అమూల్ టీ-స్పెషల్, ఆవు పాలు, గేదె పాలు వంటి అన్ని రకాల పాల వేరియంట్లపై లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ పెంపుతో అర లీటరు ప్యాకెట్‌పై రూ.1 అదనంగా భారం పడనుంది.

ధరల పెంపునకు కారణం?

పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పశువుల దాణా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు, విద్యుత్ ఛార్జీల పెరుగుదల కారణంగా పాల ధరలను పెంచక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

బడ్జెట్‌పై ప్రభావం

ప్రతిరోజూ పాలను వినియోగించే సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ముఖ్యంగా టీ, కాఫీ హోటళ్లు, స్వీట్ షాపుల యజమానులకు కూడా ఇది అదనపు భారంగా మారనుంది.

 

ఇది కూడా చదవండి: Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us