Amazon, Flipkart Offers: ఆన్‌లైన్‌ దిగ్గజాలు అమెజాన్‌.. ఫ్లిప్‌కార్టుల్లో బంపర్ ఆఫర్లు.. వీటిపై భారీ తగ్గింపు.. ఎప్పటి నుంచి అంటే..!

|

Jul 22, 2022 | 5:23 PM

Amazon, Flipkart Offers: ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగిపోయింది. ఇంట్లోనే ఉండి మొబైల్‌ ద్వారా తమకు నచ్చిన ప్రొడక్ట్‌లను ఆర్డర్‌ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో..

Amazon, Flipkart Offers: ఆన్‌లైన్‌ దిగ్గజాలు అమెజాన్‌.. ఫ్లిప్‌కార్టుల్లో బంపర్ ఆఫర్లు.. వీటిపై భారీ తగ్గింపు.. ఎప్పటి నుంచి అంటే..!
Follow us on

Amazon, Flipkart Offers: ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగిపోయింది. ఇంట్లోనే ఉండి మొబైల్‌ ద్వారా తమకు నచ్చిన ప్రొడక్ట్‌లను ఆర్డర్‌ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్లను భారీగా చేస్తుంటారు. ఈ ఆన్‌లైన్‌ దిగ్గజాలు కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా అమెజాన్‌, ఫ్లి్‌ప్‌కార్టుల్లో ఈనెల 23, 24 తేదీల్లో భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ అర్థరాత్రి 12 గంటల నుంచి ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ అతిపెద్ద వార్షిక విక్రయం కొనసాగించనుంది. అలాగే ఫ్లిప్‌కార్టు కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ఆఫర్లతో కస్టమర్ల ముందుకురానుంది. అమెజాన్‌ ప్రైమ్ డే సేల్‌లో, అమెజాన్ సేల్ సందర్భంగా, ప్రైమ్ సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులపై ఉత్తమమైన డీల్‌లను పొందుతారు. స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీ లేదా గృహోపకరణాన్ని కొనుగోలు చేయాలనుకున్నా, మీరు ప్రతి కేటగిరీ ఉత్పత్తులపై గొప్ప ఆఫర్‌లు, డీల్‌లను పొందుతారు. జూలై 22 అర్ధరాత్రి అంటే జూలై 23 అర్ధరాత్రి నుండి జూలై 24 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. అలాగే ఫ్లిప్‌ కార్టులో 23 నుంచి 27వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వీవో, రెడ్‌మీ, శాంసంగ్‌ తదితర కంపెనీ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఇతర ప్రొడక్ట్స్‌లపై తగ్గింపు ఆఫర్లు ఉండనున్నాయి.

ఈ సేల్‌లో వివిధ బ్యాంకు క్రెడిట్, డెబిట్‌ కార్డులపై తగ్గింపు పొందవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డులు, లేదా ఈఎంఐలై 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్‌ 9సిరీస్‌ ఫోన్‌పై దాదాపు రూ.15వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ఓచర్స్‌ కూడా పొందే సదుపాయం ఉంది. అలాగే ఎక్చేంజ్‌ సదుపాయం కూడా ఉంది.

రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై కూడా మంచి తగ్గింపు పొందవచ్చు. అలాగే శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లపై 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై తగ్గింపు ఆఫర్‌ పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌లో కూడా 50 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చని అమెజాన్‌ తెలిపింది. ఇక ఫ్లిప్‌కార్టులో కూడా ఎన్నో ఆఫర్లను దక్కించుకోవచ్చు. పలు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై కూడా తగ్గింపు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..