Amazon: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న అమెజాన్‌.. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!

Amazon 10 Minute Delivery: ఈ మైలురాయి గురించి అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రారంభంలో బెంగళూరులో అమెజాన్ నౌను ప్రారంభించామని, అవసరమైన వస్తువులు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు..

Amazon: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న అమెజాన్‌.. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!

Updated on: Sep 13, 2025 | 6:36 AM

Amazon: క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నౌ తన 10 నిమిషాల డెలివరీ సేవను ముంబైకి విస్తరించింది. ఢిల్లీ, బెంగళూరులోని కస్టమర్ల నుండి మంచి స్పందన వచ్చిన తర్వాత కంపెనీ ముంబైలో కూడా తన 10 నిమిషాల డెలివరీ సేవను ప్రారంభించింది. అమెజాన్ నౌ కస్టమర్లకు వేలాది రోజువారీ ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. కిరాణా, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల నుండి ఎలక్ట్రానిక్ వస్తువులు, పండుగ వస్తువుల వరకు మీరు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది 10 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. అయితే రానున్న రోజుల్లో దేశంలోని ముఖ్యమైన పట్టణాలకు ఈ సేవలు విస్తరించనున్నారు.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కి.మీ ప్రయాణం.. దీన్ని చూస్తేనే కొనేస్తారు!

ఆర్డర్ వాల్యూమ్ పెరుగుదల:

ఈ వేగవంతమైన సేవను ప్రోత్సహించడానికి కంపెనీ మూడు నగరాల్లో 100 కి పైగా మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ప్రారంభించింది. అలాగే ఆర్డర్ వాల్యూమ్‌లు నెలవారీగా 25 శాతం చొప్పున పెరుగుతున్నందున సంవత్సరం చివరి నాటికి వందల కొద్దీ కేంద్రాలను తెరవాలని యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: Auto News: సెప్టెంబర్‌ 22 తర్వాత ఏ కారు ఎంత తగ్గుతుందో తెలుసా..? పూర్తి వివరాలు

షాపింగ్ పెరిగింది:

ఈ మైలురాయి గురించి అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రారంభంలో బెంగళూరులో అమెజాన్ నౌను ప్రారంభించామని, అవసరమైన వస్తువులు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. రోజువారీ ఆర్డర్లు నెలకు నెలకు 25 శాతం పెరుగుతున్నాయి.. అలాగే ప్రైమ్ సభ్యులు అమెజాన్ నౌను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి వారి షాపింగ్ ఫ్రీక్వెన్సీ మూడు రెట్లు పెరిగింది అని అన్నారు.

ఇది కూడా చదవండి: 5 ఏళ్లలో అద్భుతాలు చేసిన 15 రూపాయల స్టాక్‌.. రూ.1 లక్షకు రూ.12 కోట్ల రాబడి

ఇది కూడా చదవండి: Cockroach: మీ ఇంట్లో బొద్దింకలు పెరిగిపోతున్నాయా? ఈ ట్రిక్స్‌ పాటిస్తే అస్సలు ఉండవు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి