ఎండాకాలం పూర్తికావొచ్చినా ఎండవేడిమి, ఉక్కపోత మాత్రం తగ్గటం లేదు. భరించలేని వేడి కారణంగా ప్రజలు కూలర్లు, ఏసీలను వదిలి ఉండలేకపోతున్నారు. అయితే, మీరు పర్సనల్‌గా ఉపయోగించేందుకు గానూ వ్యక్తిగత ఎయిర్ కూలర్ల తీసుకోవాలని యోచిస్తున్నట్టయితే ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ టాప్ బ్రాండెడ్, బెస్ట్ మినీ ఎయిర్ కూలర్లకు సంబంధించిన సమాచారం ఉంది. ఇవి బరువు తక్కువగా ఉండటమే కాకుండా పరిమాణంలో కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. మీరు వాటిని మీతో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ పోర్టబుల్ మినీ కూలర్లలో వాటర్ ట్యాంక్ కూడా అందుబాటులో ఉంది. దాంతో దీని చల్లగాలి మిమ్మల్నీ కూల్‌గా ఉంచుతుంది. ఈ మినీ ఎయిర్ కూలర్లను ఈజీగా ఉపయోగించుకోవచ్చు. పైగా కరెంటు కూడా ఆదా అవుతుంది. USB సదుపాయం ఉన్న కూలర్ కూడా ఉంది. ఈ కూలర్లు అద్భుతమైన రూపాలు, డిజైన్లలో వస్తున్నాయి. మీరు వాటిని మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ నుండి భారీ తగ్గింపులతో పొందవచ్చు.
ఈ మినీ ఎయిర్ కూలర్ వ్యక్తిగత వినియోగానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కూలర్ పరిమాణం కూడా చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీన్ని మీరు తక్కువ స్థలంలో ఎక్కడైనా సులభంగా ఉంచుకోవచ్చు. ఈ మినీ కూలర్‌తో విపరీతమైన వేడిలో కూడా మంచి చల్లదనాన్ని పొందవచ్చు. ఇది మల్టీఫంక్షన్ మినీ కూలర్. మీరు ఈ మినీ కూలర్‌ను హ్యూమిడిఫైయర్, ప్యూరిఫైయర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికి వాటర్ ట్యాంక్ కూడా ఉంది. దీనిలో మీరు నీటి నింపుకుని ఉపయోగించటం ద్వారా మరింత చల్ల గాలిని ఆస్వాదించగలుగుతారు.
ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ చాలా బాగుంది. ఇందులో 3 స్పీడ్ కంట్రోల్ సెట్టింగ్ కూడా అందుబాటులో ఉంది. USBకి కనెక్ట్ చేయడం ద్వారా ఈ కూలర్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఆఫీసు, గది, క్యాంపింగ్‌లో కూడా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఈ మినీ కూలర్ అద్భుతమైన కూలింగ్‌ను అందిస్తుంది. ఇది నిశ్శబ్ధంగా పనిచేస్తూ.. కరెంటు కూడా ఆదా చేస్తుంది. ఈ కూలర్ మన్నికైన ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. దీని బరువు కూడా చాలా తక్కువ కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇందులో 500ml వాటర్ ట్యాంక్ కూడా అందుబాటులో ఉంది.
మల్టీ స్పీడ్ సెట్టింగ్‌తో ఇది చాలా మంచి ఎయిర్ కూలర్. ఈ కూలర్ డిజైన్ పోర్టబుల్, ఎర్గోనామిక్. ఇది చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కూలర్‌లో నీటిని కూడా నింపుకోవచ్చు. దాంతో ఏసీలాంటి చల్ల గాలిని పొందగలుగుతారు. USB పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎయిర్ కూలర్ గది, ఆఫీస్, బెడ్‌రూమ్, టెంట్ క్యాంప్‌కి చాలా బాగుంటుంది.. ఇది తక్కువ శబ్ధంతో, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది అప్‌గ్రేడ్ చేసిన ఫిల్టర్‌లను కూడా కలిగి ఉంది.
గొప్ప టాబ్లెట్ ఫ్యాన్ ఎయిర్ కూలర్ . ఈ ఎయిర్ కూలర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ కూలర్ టచ్ కంట్రోల్ కలిగి ఉంది. ఇందులో రంగు మారుతున్న LEDని ఏర్పాటు చేశారు. కాబట్టి, మీరు దీనిని నైట్ ల్యాంప్ గా కూడా ఉపయోగించవచ్చు. ఈ కూలర్ పెద్దగా సౌండ్ లేకుండా బెడ్‌రూమ్‌కి కూడా అనువైనదిగా ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ నుండి శబ్దం ఉండదు. అందువల్ల మీరు మీ పనిని ఎలాంటి అటంకం లేకుండా చేసుకోవచ్చు. దీని చల్లదనం కూడా చాలా బాగుంటుంది.
ఇది రిఛార్జబుల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ఫ్యాన్. ఈ మినీ కూలర్‌తో మీరు మరింత చల్లదనాన్ని, చల్లని గాలిని పొందుతారు. ఇందులో 3 స్పీడ్ సెట్టింగ్‌తో పాటు 7 రంగులు మార్చుకునే సపోర్ట్ కూడా ఇవ్వబడింది. ఇది అన్ని గదులకు అనువైనదిగా పనిచేస్తుంది. అమేజింగ్ లుక్‌తో, మీకు నచ్చే డిజైన్‌తో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టబుల్ మినీ కూలర్ బరువు తక్కువ. వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ చిన్న కూలర్ పరిమాణం, డిజైన్‌లో కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది స్విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. మీరు ఈ కూలర్‌ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..