Amazon Sale Offer: అమెజాన్‌లో మరో అద్భుతమైన ఆఫర్.. స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు..!
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ కస్టమర్లకు అమెజాన్..
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ కస్టమర్లకు అమెజాన్ సేల్ ఆగస్టు 5 అర్ధరాత్రి ప్రారంభం కాగా, ఇతర కస్టమర్ల కోసం ఈ సేల్ ఆగస్టు 6 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్ సమయంలో అనేక ఉత్పత్తులు తగ్గింపు పొందవచ్చు. పలు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. సేల్ సమయంలో, పలు టీవీ మోడళ్లపై 60 శాతం వరకు భారీ తగ్గింపు అందించబడుతోంద. సేల్‌లో 32 అంగుళాల నుండి 55 అంగుళాల వరకు ఉన్న టీవీ మోడళ్లపై కస్టమర్‌లు తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు.
క్రెడిట్ కార్డుపై అదనపు తగ్గింపు
అమెజాన్‌లు పలు ఉత్పత్తులపై అదనపు తగ్గింపు పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉపయోగించి అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే కస్టమర్ల సౌలభ్యం కోసం ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.
24-అంగుళాల LED టీవీ ధర అమెజాన్ సేల్‌లో తగ్గింపు తర్వాత రూ. 6499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో 2 స్పీకర్లు, 20 వాట్ల స్పీకర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 10499కి పొందవచ్చు. అలాగే, 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ మోడల్ కూడా అమెజాన్ సేల్‌లో తగ్గింపును పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత మీరు ఈ మోడల్‌ను రూ.14999కి కొనుగోలు చేయగలుగుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి