
ప్రస్తుతం ఇంటర్నెట్ అవసరం బాగా పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికీ ఇంటర్నెట్ కావాల్సి వస్తుంది. అయితే ఇప్పటికీ ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం పీఎంవాణి (PM-WANI) అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మీ వైఫైను ఇతరులకు షేర్ చేస్తూ డబ్బు సంపాదించొచ్చు.
పీఎం వాణి పథకం ద్వారా వైఫై యూజర్లు వారి వై-ఫై నెట్‌వర్క్‌ను ఇతర ప్రజల కోసం షేర్ చేయడం ద్వారా ఆదాయం పొందొచ్చు. మీ ఇల్లు లేదా దుకాణంలో వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. మీరు దాన్ని ప్రభుత్వ రిజిస్టర్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా మీ డేటాను అమ్ముకోవచ్చు.
డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా టెలికాం శాఖ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. మీకు ఒక రౌటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)గా కింద మీ డీటెయిల్స్ ను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీ నెట్‌వర్క్ పబ్లిక్ వై-ఫైగా యాక్టివేట్ అవుతుంది. తద్వారా సాధారణ ప్రజలు మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతారు. అలా మీ డేటే యూసేజ్ ను బట్టి మీకు కమీషన్ లభిస్తుంది.
మీరు ఈ పథకంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే PM-WANI యాప్‌లో పబ్లిక్ డేటా ఆఫీస్‌గా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు PDO ఐడీ వస్తుంది. తర్వాత మీరు మీ వై-ఫై రౌటర్‌ను నమోదు చేసి, నెట్‌వర్క్‌ను పబ్లిక్ గా లైవ్ చేయాలి. దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. ఇది ఒక పబ్లిక్ సర్వీస్ లా పరగణిస్తారు. దానికై ప్రభుత్వం మీకు కమీషన్ రూపంలో కొంత ఆదాయాన్ని ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.