
రకరకాల ఆర్థిక అవసరాల రీత్యా పర్సనల్ లోన్ కు అప్లై చేస్తుంటారు చాలామంది. అయితే కొన్నిసార్లు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం కూడా మీరు గమనించే ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే అసలు లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసుకోవాలి. తద్వారా మరో ప్రత్యామ్నాయం ఆలోంచించే అవకాశం ఉంటుంది.
మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే.. మీరు ఎన్ని సార్లు లోన్ కు అప్లై చేసినా లోన్ అప్రూవ్ అవ్వదు. పర్సనల్ లోన్ పొందటానికి, మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇలా లేని వాళ్లు లోన్ అప్లై చేసి ఉపయోగం లేదు. కాబట్టి ముందు క్రెడిట్ స్కోర్ పెంచే మార్గాలు చూడాలి. లేదా వేరే ఇతర మార్గాలు ఆలోచించాలి.
మీకు నెలవారీ ఆదాయం లేదా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ లేదా బిజినెస్.. ఇలా ఏదో ఒక సేఫ్టీ లేనిదే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ముందుకు రావు. ఒకవేల మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంటే బంగారం లేదా ఇతర ఆస్తులను సేఫ్టీగా పెట్టి లోన్ తీసుకునే ఆప్షన్ గురించి ఆలోచించండి.
మీ ఏజ్ 21 కంటే తక్కువ లేదా 60 ఏళ్లకు పైబడి ఉంటే మీకు లోన్ వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి మీరు మెరుగైన క్రెడిట ప్రొఫైల్ పై దృష్టి పెట్టాలి. అప్పుడే బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. లేదా స్నేహితులు, బంధువుల పేరు మీద లోన్స్ తీసుకోవచ్చు.
ఆల్రెడీ రెండు మూడు లోన్స్ కడుతూ ఉంటే మరో లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. మీ ఆదాయంలో సగం కంటే ఎక్కువ లోన్స్ చెల్లించడానికే ఖర్చు అవుతున్నట్టయితే కొత్తగా మరో లోన్ పొందడం కష్టమే. కాబట్టి ఇతర ఆప్షన్స్ కోసం ట్రై చేయడం బెటర్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి