SBI Customer Alert: ఎస్​బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ సమయంలో ఈ బ్యాంక్ సేవలు బంద్.. ఎందుకంటే..

SBI Customer Alert: మీకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా.? అయితే ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా...

SBI Customer Alert: ఎస్​బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ సమయంలో ఈ బ్యాంక్ సేవలు బంద్.. ఎందుకంటే..
State Bank Of India

Updated on: May 07, 2021 | 1:57 PM

SBI Customer Alert: మీకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా.? అయితే ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఈ నెల 7వ తేదీ రాత్రి 10.15 గంటల నుంచి మే 8వ తేదీ అర్ధరాత్రి 1.45 గంటల వరకు.. అంటే మూడున్నర గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సర్వీసులు అన్నీ కూడా పని చేయవని ఎస్బీఐ పేర్కొంది.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన జారీ చేసింది. మెయింటనెన్స్ కారణంగా UPI సేవల్లో అంతరాయం కలుగుతుందని చెప్పింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి.. తమకు సహకరించాలని కోరింది. ఖాతాదారులు సహకరించాలని కోరింది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..

ఎస్‌బీఐ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ, ఇతర పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్తుంటారు. అయితే ఇటీవల కేవైసీ సమర్పించడానికి మే 31వ తేదీగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ప్రకటించింది. ఒక వేళ 31లోపు సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటనను ఎస్‌బీఐ ఉపసంహరించుకుంది. కేవైసీలను సమర్పించడానికి బ్రాంచ్‌లకు రావొద్దని సూచించింది. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు పోస్టు లేదా రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీ ద్వారా అవసరమైన పత్రాలు పంపవచ్చని సూచించింది.

కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి కేవైసీ ఇవ్వని పరిస్థితి ఉండటంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ తన మంత్రిత్వశాఖకు సంబంధించిన విభాగాలకు ఆదేశించింది. కొంత కాలం కిందట ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ చేసిన ట్వీట్‌ తర్వాత ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గమనించాలని సూచించారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?