Bank Alert: HDFC యూజర్లకు షాక్.. UPI చెల్లింపులకు పరిమితి పెట్టిన బ్యాంక్.. పూర్తి వివరాలు..

Bank Alert: ఈ రోజుల్లో అందరూ యూపీఐ ద్వారా లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. UPIకి పెరుగుతున్న జనాదరణతో, వినియోగదారులకు వాటిని ఉపయోగించుకునేందుకు ఉన్న నిబంధనలు, షరతులూ కూడా మారుతున్నాయని తెలుసుకోవాలి.

Bank Alert: HDFC యూజర్లకు షాక్.. UPI చెల్లింపులకు పరిమితి పెట్టిన బ్యాంక్.. పూర్తి వివరాలు..
Hdfc Bank

Updated on: Apr 12, 2022 | 3:07 PM

Bank Alert: ఈ రోజుల్లో అందరూ యూపీఐ ద్వారా లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. UPIకి పెరుగుతున్న జనాదరణతో, వినియోగదారులకు వాటిని ఉపయోగించుకునేందుకు ఉన్న నిబంధనలు, షరతులూ కూడా మారుతున్నాయని తెలుసుకోవాలి. దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ HDFC తాజాగా తన యూపీఐ పేమెంట్స్ రూల్స్ మార్చుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను బ్యాంక్ తన వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “మా UPI నిబంధనలు & షరతులు మార్చబడ్డాయి అని ప్రదర్శిస్తోంది. దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మారిన నిబంధనలు, షరతులను చదవండి” అంటూ టిక్కర్ రన్ చేస్తోంది. చెల్లింపులు చేయడానికి UPIని ఉపయోగించాలనుకునే బ్యాంక్ కస్టమర్‌లు ఇకపై మారిన రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి.

రోజువారీ లావాదేవీల పరిమితి.. అంటే 24 గంటల ప్రాతిపదికన రూ. 1 లక్ష లేదా రోజుకు పది లావాదేవీలకు పరిమితం చేసిన విషయాన్ని వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి. 10-లావాదేవీ పరిమితి నిధుల బదిలీలకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ వెల్లడించింది. బిల్లుల చెల్లింపులు, వ్యాపారి లావాదేవీలకు ఈ 10 నిబంధన వర్తించదని HDFC స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో మొదటి 24 గంటలు, ఐఫోన్‌లో 72 గంటలు కొత్త UPI వినియోగదారులు లేదా తాజాగా పరికరం/సిమ్/మొబైల్ నంబర్‌ను మార్చుకున్న వారు రూ. 5,000 వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరని బ్యాంక్ వెల్లడించింది. రానున్న కాలంలో ఇలాంటి నిబంధనలు అన్ని బ్యాంకులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Crypto Investment: మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Knowledge: నగరాల పేర్లు మార్చడం ఎప్పుడు మొదలైంది.. దీనికి కారణాలు ఏంటి..?