EPFO: ఇకపై పీఎఫ్‌ను అలా విత్‌డ్రా చేయలేరు.. కొత్త రూల్స్‌ ఎలా ఉంటాయంటే..

| Edited By: Ram Naramaneni

Dec 29, 2023 | 4:13 PM

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) నగదు విత్‌డ్రాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలిన సమయంలో ఖాతాదారుల ఆరోగ్య అవసరాల కోసం ఇచ్చిన కోవిడ్‌-19 అడ్వాన్స్‌ ఆప్షన్‌ ను తొలిగిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇది అమలైతే కోవిడ్‌ అడ్వాన్స్‌ ఫెసిలిటీని వినియోగించుకోవడం సాధ్యపడదు.

EPFO: ఇకపై పీఎఫ్‌ను అలా విత్‌డ్రా చేయలేరు.. కొత్త రూల్స్‌ ఎలా ఉంటాయంటే..
Epfo
Follow us on

మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా? డబ్బు అవసరం అయ్యి పీఎఫ్‌లోని కొంతమొత్తాన్ని విత్‌ డ్రా చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో బ్రేకింగ్‌ న్యూస్‌. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) నగదు విత్‌డ్రాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలిన సమయంలో ఖాతాదారుల ఆరోగ్య అవసరాల కోసం ఇచ్చిన కోవిడ్‌-19 అడ్వాన్స్‌ ఆప్షన్‌ ను తొలిగిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇది అమలైతే కోవిడ్‌ అడ్వాన్స్‌ ఫెసిలిటీని వినియోగించుకోవడం సాధ్యపడదు. ఒకవేళ మీరు పీఎఫ్‌ నుంచి నగదు విత్‌ డ్రా చేసే ఆలోచనలో ఉంటే ఈపీఎఫ్‌ఓ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఓ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. లేకుంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

కోవిడ్‌ విజృంభణ సమయంలో..

మన దేశంలో 2020లో కరోనా మహమ్మారి విజృంభించింది. దీంతో లాక్‌డౌన్‌ అనివార్యమైంది. పైగా ఆస్పత్రుల ఖర్చులు బాగాపెరిగి పోయాయి. ఈ క్రమంలో పీఎఫ్‌ ఖాతాదారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ విత్‌డ్రా నిబంధనలు సడలించింది. కోవిడ్‌ అడ్వాన్స్‌ పేరిట కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఖాతాదారుడు ఏడాదిలో రెండు సార్లు నగదు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2020 మార్చిలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై)లో భాగంగా దీనిని అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఎంప్లాయిమెంట్‌ ఇన్‌ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ 1952 చట్టంలో మార్పులు చేసింది. దీని ప్రకారం మూడు నెలల పాటు ప్రాథమిక వేతనాలు, డియర్‌ నెస్‌ అలవెన్స్‌ల మేరకు ఈపీఎఫ్‌ ఖాతాల సభ్యను క్రెడిట్‌లో ఉన్న మొత్తం నుంచి 75శాతం వరకూ ఏది తక్కువైతే అది ఖాతా నుంచి ఉపసంహకరించుకునేందుకు అవకాశం కల్పించింది.

లక్షల్లో కొత్త ఖాతాలు..

ఈ ఏడాది గణనీయంగా పీఎఫ్‌ ఖాతాలు పెరిగాయి. ఒక్క అక్టోబర్‌ నెలలోనే ఏకంగా 15.29లక్షల పీఎఫ్‌ ఖాతాలు తెరిచనట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. డిసెంబర్‌ 20న విడుదల చేసిన పేరోల్‌ డేటా ప్రకారం గత ఏడాదితో పోల్చితే ఇది 18.22శాతం అధికమని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే విధంగా 2023 అక్టోబర్లో మొత్తం 7.72లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌ఓకు చెందిన సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ కిందకు వచ్చినట్లు వివరించింది. గత సంవత్సరంతో పోల్చితే అది 6.07శాతం అధికం అని చెప్పింది. అలాగే అక్టోబర్, 2023 లో మొత్తం 7. 72 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓకు చెందిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కిందకు వచ్చినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 6. 07 శాతం అధికమని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..