Alert: జూన్ 30లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే జరిమానా చెల్లించాల్సిందే..!

|

Jun 25, 2022 | 3:04 PM

జూన్ నెల ముగిసేందుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్ 30లోపు మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Alert: జూన్ 30లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే జరిమానా చెల్లించాల్సిందే..!
Link Aadhaar Pan
Follow us on

జూన్ నెల ముగిసేందుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూన్ 30లోపు మీరు పూర్తి చేసుకోవాల్సి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. గుడవు తేదీలోగా ఈ పనులు పూర్తి చేయకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో మీ ఆధార్, పాన్ నుంచి రేషన్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. కాబట్టి, జూన్ 30లోపు ఏ పనులు పూర్తి చేసుకోవాలో ఓసారి చూద్దాం..

ఆధార్, పాన్ లింక్ చేయండి..

మీరు ఇంకా మీ ఆధార్, పాన్ లింక్ చేయకుంటే, వీలైనంత త్వరగా చేయండి. ఆధార్‌తో లింక్ చేయకుండా పాన్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి గడువు మార్చి 31, 2023 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్చి 29, 2022 నాటి నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. మీరు 30 జూన్ 2022 లేదా అంతకు ముందు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే రూ. 500 ఛార్జీ చెల్లించాల్సి ఉంది. అదే సమయంలో, మీరు జులై 1, 2022న లేదా ఆ తర్వాత ఆధార్, పాన్‌లను లింక్ చేసినట్లయితే, రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, జూన్ 30లోపు మీరు మీ ఆధార్, పాన్‌ను లింక్ చేస్తే, తక్కువ జరిమానాతో తప్పించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసే విధానం..

  1. ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ www.incometax.gov.inకి వెళ్లండి.
  2. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత, ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  3. ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  4. మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.
  5. దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత, ధృవీకరించుపై క్లిక్ చేయండి.
  6. ఆ తర్వాత ఆలస్య రుసుము చెల్లించాలి. ఆలస్య రుసుము చెల్లించిన తర్వాత, మీ ఆధార్, పాన్ లింక్ చేసినట్లు మెసేజ్ వస్తుంది.

డీమ్యాట్ ఖాతా KYCని పూర్తి చేయాలి..

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను కలిగి ఉన్నవారు జూన్ 30 లోపు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయాలి. మీరు మీ డీమ్యాట్-ట్రేడింగ్ ఖాతా KYCని పూర్తి చేయకుంటే.. జూన్ 30 వరకు మాత్రమే సమయం ఉంది. ఇంతకు ముందు దీని గడువు 31 మార్చి 2022గా ఉంచారు. ఇప్పుడు ఏ డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతాలు తెరిచినా లేదా ప్రారంభించినా, ఆరు రకాల సమాచారాన్ని అందించడం తప్పనిసరి చేసింది. ఈ సమాచారంలో, పేరు, చిరునామా, పాన్, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, ఆదాయాలు, సరైన ఇమెయిల్ ఐడీని పేర్కొనడం అవసరం. అలాగే, కస్టమర్ల ఆధార్ నంబర్‌ను వారి పాన్‌తో లింక్ చేయాలి.

నిబంధనల ప్రకారం, ఖాతాదారులు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయకపోతే, అతని ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. అయితే ఖాతాలో ఇప్పటికే ఉన్న షేర్లు లేదా పోర్ట్‌ఫోలియో అలాగే కొనసాగుతుంది. కానీ కొత్త రకం ట్రేడింగ్‌ను చేయలేరు. ఈ ఖాతాలో KYC వివరాలు అప్‌డేట్ అయినప్పుడు మాత్రమే మళ్లీ యాక్టివేట్ అవుతుంది.

రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయండి..

మీరు ఇంకా మీ రేషన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, జూన్ 30, 2022లోపు దాన్ని పూర్తి చేయండి. మార్చి 31వ తేదీలోగా లింక్ చేయాలని గతంలో ప్రకటించారు. కానీ, మార్చిలో దాని గడువు 30 జూన్ 2022కి పెంచారు. ప్రభుత్వం రేషన్ కార్డును యూనివర్సల్ లేదా వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్‌గా ప్రకటించినప్పటి నుంచి, దానిని ఆధార్‌తో లింక్ చేయడంపై దృష్టి సారిస్తోంది. ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం తమ తాత్కాలిక పని ప్రదేశంలో రేషన్‌ను కోల్పోయిన వలస జనాభాకు రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం చాలా ముఖ్యం. రేషన్‌తో ఆధార్ లింక్ చేయడం వల్ల ఎక్కడి నుంచైనా రేషన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

  1. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయండిలా..
  2. ముందుగా PDS వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  3. ఆ తర్వాత రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేయండి.
  4. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  5. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  6. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కి OTP వస్తుంది.
  7. చివరగా, OTPని నమోదు చేస్తే సరిపోతుంది.