
ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. కానీ ఈ రోజుల్లో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇటువంటి పరిస్థితిలో బంగారం కొనాలనుకుంటే ఎవరు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు? ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.. ఈ అక్షయ తృతీయ సందర్భంగా టాటా, రిలయన్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వచ్చాయి. దీన్ని సద్వినియోగం చేసుకుని మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు.
టాటాకు చెందిన ప్రముఖ బంగారు ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్, అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దాని అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఆఫర్ ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 30 వరకు నడుస్తుంది, దీనిపై గరిష్టంగా 20 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో మీరు రూ. 50,000 కంటే తక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తే, దానిపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు రూ.50,000 నుండి రూ.3 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే దానిపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. రూ. 3 లక్షల నుండి రూ. 8 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తే 15 శాతం ఆఫర్ అందుకోవచ్చు. 8 లక్షలకు పైగా కొనుగోళ్లపై ఏకంగా 20 శాతం తగ్గింపు లభిస్తుంది.
అక్షయ తృతీయ సందర్భంగా రిలయన్స్ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్ జ్యువెలర్స్ నుండి బంగారం కొనుగోలుపై 25 శాతం ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పత్రికా ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో, మీరు వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేస్తే, దానిపై మీకు 30 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను ఏప్రిల్ 24 నుండి మే 5, 2025 వరకు పొందవచ్చు.
అక్షయ తృతీయ నాడు మలబార్ గోల్డ్‌కు ప్రత్యేక ఆఫర్ ఉంది. కంపెనీ పత్రికా ప్రకటన ప్రకారం, బంగారం కొనుగోలుపై 25 శాతం తగ్గింపు అందిస్తోంది. వజ్రాల కొనుగోలుపై 25 శాతం తగ్గింపు కూడా ఉంది.