Airtel Plan: 45 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌!

|

Jun 20, 2024 | 4:24 PM

వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎయిర్‌టెల్‌ కూడా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ.279 విలువ గల ప్రీపెయిడ్ ప్లాన్‌పై వ్యాలిడిటీతోపాటు..

Airtel Plan: 45 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌!
Airtel
Follow us on

వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎయిర్‌టెల్‌ కూడా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ.279 విలువ గల ప్రీపెయిడ్ ప్లాన్‌పై వ్యాలిడిటీతోపాటు అపరిమిత కాల్స్ సదుపాయం కల్పిస్తోంది. దీని వ్యాలిడిటీ 45 రోజుల వరకూ ఉంటుంది. ఈ ప్లాన్ సాధారణంగా 28 లేదా 30 రోజుల వరకూ మాత్రమే ఉంటుంది. కానీ తాజా కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ కింద మరో 15 రోజుల పాటు వ్యాలిడిటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎయిర్‌టెల్‌. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ తదితర వసతులు లభిస్తాయి. అలాగే 6జీబీ డేటాతో 70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్, రూ.455తో 84 రోజుల వ్యాలిడిటీ ప్రీ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Broadband Plans: మీకు ఇంటర్నెట్‌ కావాలా? దిమ్మదిరిగే మూడు చవకైన బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌!

రూ.279 ప్లాన్ కింద మొత్తం 2జీబీ డేటా లభిస్తుంది. డేటా పూర్తయిన తర్వాత ఒక్కో ఎంబీపీఎస్ డేటాకు 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడిటీలో 600 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. అటుపై ఒక్కో మెసేజ్‌కి రూపాయి చార్జి విధిస్తుంది. వీటితోపాటు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ తదితర అదనపు బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి. డేటా వాడకుండా కేవలం వ్యాలిడిటీ కోసం వాడే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

ఇది కూడా చదవండి: School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి