Bharti Airtel Tariffs: ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

|

Jul 28, 2021 | 3:59 PM

Airtel raises minimum prepaid plan : భారతీ ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను రూ .49 నుంచి రూ .79 కు పెంచుతూ నిర్ణయం..

Bharti Airtel Tariffs: ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
Airtel Raises
Follow us on

Airtel raises minimum prepaid plan : భారతీ ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను రూ .49 నుంచి రూ .79 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పెయిడ్ పన్నులను సవరించిన కొన్ని వారాల తర్వాత ఈ ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఉన్న 49 ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేశామని ఎయిర్‌టెల్ యాజమాన్యం తెలిపింది. దీంతో రేపటి నుంచి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ ప్యాక్‌లు ఇప్పుడు రూ .79 నుండి ప్రారంభంకానున్నాయి. ఈ ప్యాక్ తో రీఛార్జ్ చేయించుకునే వినియోగదారులు డబుల్ డేటాతో పాటు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్‌ గోయింగ్ నిమిషాలు అదనపు ప్రయోజనాలుగా పొందనున్నారు.

అయితే ఈ ప్రారంభ రికార్జ్ ను పెంచినా తమ కస్టమర్లు తమ ఖాతా బ్యాలెన్స్ ను గురించి ఆలోచికుండా ఉండేలా ఈ విధంగా అదనపు ప్రయోజనాలు అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. రూ .79 రీఛార్జ్ ప్యాక్‌తో .. ఎయిర్‌టెల్ లోకల్, ఎస్‌టిడి కాల్‌లకు వర్తించే సెకనుకు ఒక పైసాతో రూ .64 విలువైన టాక్‌టైమ్‌ను అందిస్తోంది. అంతేకాదు ఈ ప్లాన్ లో భాగంగా 200MB డేటా ను ఇస్తుంది. ఈ ప్యాక్ వినియోగం 28 రోజులు పాటు కాలపరిమితి ఉండనుంది. ఈ సవరించిన ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ జూలై 29 నుండి వర్తిస్తుంది.

ప్రీపెయిడ్ కస్టమర్లు కంపెనీ మొత్తం చందాదారుల్లో 95% ఉన్నారు. అయితే పన్నులను అనుసరించి టారిఫ్ ను పెంచిన మొదటి టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. అయితే ఎయిర్ టెల్ బాటలో మరిన్ని కంపెనీలు అనుసారించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Suicide Plant: ప్రపంచంలోనే డేంజర్ మొక్కల్లో ఇది ఒకటి.. దీనిని తాకితే నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటారట