Airtel Offers: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ఆఫర్స్.. కేవలం 150 లోపే నాలుగు ప్లాన్స్..

|

Jul 06, 2022 | 2:27 PM

Airtel Offers: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వినియోగదారులకు కంపెనీ అదిరిపోయే ప్లాన్స్ ప్రకటించింది. తాజాగా ఎయిర్ టెల్ తన వినియోగదారుల..

Airtel Offers: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ఆఫర్స్.. కేవలం 150 లోపే నాలుగు ప్లాన్స్..
Airtel Offers
Follow us on

Airtel Offers: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వినియోగదారులకు కంపెనీ అదిరిపోయే ప్లాన్స్ ప్రకటించింది. తాజాగా ఎయిర్ టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్తగా నాలుగు ప్రీపెయిడ్ రీచార్స్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లలో రెండు స్మార్ట్ రీఛార్జ్ ప్యాక్‌లు, మరో రెండు రేట్ కంటింగ్ ప్లాన్స్ ఉన్నాయి. కాగా, ఈ కొత్త నాలుగు ప్లాన్‌లు కూడా 150 రూపాయలలోపే ఉండటం విశేషం. అవేంటంటే.. రూ.109, రూ.111, రూ.128, రూ.131. అయితే, ఈ నాలుగు ప్లాన్‌లు ప్రాథమికంగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా తమ ఫోన్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రకటించడం జరిగింది. ప్లాన్‌లు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అప్‌డేట్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 109 ప్లాన్..
ఎయిర్‌టెల్ ప్రకటించిన ప్లాన్స్‌లో అతి తక్కువది ఈ ప్లాన్. 109 తో రీచార్జ్ చేస్తే 30 రోజుల వ్యాలిడిటీతో.. 200 ఎంబీ డేటా, 99 టాక్ టైమ్, ప్రీపెయిడ్ ప్యాక్ లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్‌కు సెకనుకు 2.5 పైసలు ఖర్చు అవుతాయి. లోకల్ ఎస్ఎంఎస్ ఛార్జీ రూ. 1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ ఛార్జీ రూ. 1.44 గా పడుతుంది.

ఎయిర్‌టెల్ రూ. 111 టాకా ప్లాన్..
ఎయిర్ టెల్ రూ. 111 టాకా ప్లాన్‌లో వినియోగదారులు 99 టాక్ టైమ్, 200MB డేటాను పొందుతారు. ఒక నెల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాక్‌లో లోకల్, ఎస్టీడీ, ల్యాండ్‌లైన్ కాల్‌లకు సెకనుకు రూ. 2.5 ఖర్చు అవుతుంది. అలాగే లోకల్ SMS రూ. 1 ఛార్జీ, STD SMS రూ. 1.5 ఛార్జ్ పడుతుంది.

ఎయిర్‌టెల్ రూ. 128 ప్లాన్..
ఈ కొత్త రూ. 128 ఎయిర్‌టెల్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ రీఛార్జ్ ప్యాక్ లోకల్, STD కాల్స్‌కు సెకనుకు రూ. 2.5 ఖర్చు అవుతుంది. నేసణల్ వీడియో కాల్‌ సెకనుకు రూ. 5 ఛార్జ్ చేస్తారు. అలాగే ఒక్కో ఎంబీకి 50 పైసలు ఛార్జ్ చేస్తారు.

ఎయిర్‌టెల్ రూ. 131 ప్లాన్..
కొత్త ఎయిర్‌టెల్ రూ.131 ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో లోకల్, STD కాల్స్ కోసం కస్టమర్‌లు సెకనుకు రూ. 2.5 చెల్లించాలి. మరోవైపు, జాతీయ వీడియో కాల్ కాస్ట్ సెకనుకు రూ. 5 అవుతుంది. అలాగే, మీరు స్థానిక SMS కోసం రూ. 1, STD SMS కోసం రూ. 1.5 కాస్ట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ చేయండి..