FD: అదిరిపోయే వడ్డీ రేట్లతో ఎఫ్‌డీ స్కీమ్‌.. ఏకంగా 9.1 శాతం వడ్డీ

|

Sep 09, 2024 | 4:49 PM

ఈ స్కీమ్‌లో భాగంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన వారికి అత్యధికంగా వడ్డీని అందిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి ఏకంగా 9.1 శాతం వరకు వడ్డీని అందించనున్నారు. ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్‌తో సహా బహుళ చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లతో పాటు NBFCల భాగస్వామ్యం....

FD: అదిరిపోయే వడ్డీ రేట్లతో ఎఫ్‌డీ స్కీమ్‌.. ఏకంగా 9.1 శాతం వడ్డీ
Fd Scheme
Follow us on

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ఎయిర్‌ బ్యాంకింగ్‌ పేరుతో ఆర్థిక సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ విభాగం ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌ కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఖాతాదారులు మంచి రాబడి కోసం డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

ఈ స్కీమ్‌లో భాగంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన వారికి అత్యధికంగా వడ్డీని అందిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి ఏకంగా 9.1 శాతం వరకు వడ్డీని అందించనున్నారు. ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్‌తో సహా బహుళ చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లతో పాటు NBFCల భాగస్వామ్యం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవను అందించింది.

ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌తో ఈ కొత్త సేవలను అనుసంధానించారు. ఇందుకోసం బ్యాంకు అకౌంట్ కూఆ తెరకుండానే పెట్టుబడి పెట్టొచ్చు రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఎన్‌బిఎఫ్‌సిలు , స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌.. ఎయిర్‌టెల్ ఫ్లెక్సీ క్రెడిట్ పర్సనల్ లోన్, కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్, కో-బ్రాండ్ ఇన్‌స్టా EMI కార్డ్‌తో పాటు.. పలు ఆర్థిక సంస్థలతో గోల్డ్ లోన్‌లను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేవలన్నింటినీ ఎయిర్‌టెల్ థాంక్స్‌ యాప్ ద్వారా యాస్సెస్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఫైనాన్స్ సేవలను దేశ వ్యాప్తంగా సుమారు మూడున్నర కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..