Airtel: ఎన్నో సంక్షోభాలను ఎయిర్‌టెల్‌ తట్టుకుని నిలబడింది..సునీల్ భారతీ మిట్టల్

|

Apr 17, 2021 | 6:43 PM

సంక్షోభాలు ఎయిర్‌టెల్‌ కు కొత్తకాదనీ, ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడిందనీ ఆ సంస్థ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ అన్నారు.

Airtel: ఎన్నో సంక్షోభాలను ఎయిర్‌టెల్‌ తట్టుకుని నిలబడింది..సునీల్ భారతీ మిట్టల్
Airtel Bharati Chairman Sunil Mittal
Follow us on

Airtel: సంక్షోభాలు ఎయిర్‌టెల్‌ కు కొత్తకాదనీ, ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడిందనీ ఆ సంస్థ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ అన్నారు. అమెజాన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం పరిశ్రమపై జియో ముద్ర, దేశ భవిష్యత్తుపై ఆయన మాట్లాడారు. ”భారతీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన పోటీదారుగా జియో వచ్చినపుడు 2016లో అతి పెద్ద సంక్షోభం వచ్చింది. ఏడాది పాటు రాయితీ సేవలు, మార్కెట్‌ను కొల్లగొట్టే టారిఫ్‌లు, సబ్సిడీ ఫోన్లు.. వీటన్నింటి ఫలితంగా 12 ఆపరేటర్లలో 9 మంది తట్టా, బుట్టా సర్దుకుని వెళ్లిపోవడం, దివాలా తీయడం జరిగింది. మాతోపాటు కొంతమంది ఆపరేటర్లతో విలీనం అయిపోయాయి కొన్ని కంపెనేలు. ఇప్పుడు ముగ్గురు ప్రయివేట్ ఆపరేటర్లే మిగిలారు. వీరిలో ఒక ఆపరేటర్‌ భారీగా ఎదగడం ప్రశ్నార్థకమని మిట్టల్‌ వ్యాఖ్యానించారు.

వ్యాపారానికి భారతదేశం చక్కని వేదిక ఇక్కడ వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. జీడీపీ, వినియోగ రంగానికి యువ జనాభా ప్రోత్సాహాన్నిస్తోంది. భారత్‌ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల సాయంతో అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఊబర్, ఓలా సేవలను వినియోగిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి డెలివరీ సేవలు సహా అన్నీ కూడా డిజిటల్‌ వేదికపై వేగంగా మళ్లుతున్నాయి’’ అని మిట్టల్‌ వివరించారు. వచ్చే 5–10 ఏళ్లలో భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరింత తయారీ, డిజిటల్, స్వీయ సమృద్ధ భారత్‌ను భవిష్యత్ లో మనం చూస్తామన్నారు.

కాగా, ఇటీవల నిర్వహించిన వేలంలో స్పెక్ట్రంను కొనుగోలు చేసిన టెల్కోలకు కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్లు టెలికం శాఖ (డాట్‌) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ అసైన్‌మెంట్‌ లెటర్లను బిడ్డర్లకు శుక్రవారం జారీ చేసినట్లు తెలిపింది. స్పెక్ట్రంను వెంటనే కేటాయించిన నేపథ్యంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ సంస్థలు తక్షణం సుమారు రూ. 2,307 కోట్లు చెల్లించినట్లు డాట్‌ తెలిపింది.

Also Read: Viral: వీధుల్లో ప్రవహించిన ‘పాల నది’.. ఆశ్చర్యపోయిన జనం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కరోనా విజృంభణ.. అంతకంతకు పెరుగుతున్న కేసులు.. కొత్తగా 7,224 మందికి పాజిటివ్