Air India: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా.. ప్రయాణికుల విషయంలో ఆ తప్పు చేసినందుకే

|

Jun 14, 2022 | 5:25 PM

Air India: చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు గాను ఎయిర్ ఇండియా సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 10 లక్షల జరిమానా విధించింది.

Air India: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా.. ప్రయాణికుల విషయంలో ఆ తప్పు చేసినందుకే
Air India
Follow us on

Air India: చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు గాను ఎయిర్ ఇండియా సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలో భాగంగా, కాంపిటెంట్ అథారిటీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా.. సమస్యను పరిష్కరించడానికి తక్షణమే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని డీజీసీఏ ఎయిర్‌లైన్‌కు సూచించింది. దిద్దుబాటు చర్యలు తీసుకోవటంలో ఎయిర్ ఇండియా విఫలమైతే తదుపరి చర్యలు ఉంటాయని DGCA స్పష్టం చేసింది.

ప్రయాణికులు చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉండి, సమయానికి హాజరైనప్పటికీ.. విమానయాన సంస్థలు బోర్డింగ్‌ను తిరస్కరించినట్లు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ రంగంలో దిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే.. మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీలు నిర్వహించిన తర్వాత DGCA తెలిపింది.

గంటలోపు ప్రత్యామ్నాయం చూపిస్తో నో పెనాల్టీ..

ఎయిర్ ఇండియా విషయంలో నిబంధనలు పాటించని చోట.. సదరు సంస్థకు DGCA షోకాజ్ నోటీసు జారీ చేసింది. వ్యక్తిగత విచారణ కూడా కంపెనీకి అందించింది. ఇలాంటి ఘటనల్లో కంపెనీలు నిస్సహాయ ప్రయాణికులకు ఎలాంటి పరిహారం చెల్లిచడం లేదని తెలుస్తోందని డీజీసీఏ అభిప్రాయపడింది. చెల్లుబాటు అయ్యే టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణీకుడికి బోర్డింగ్ నిరాకరించడానికి మార్గదర్శకాలను నిర్దేశిస్తూ.. ఒక ఎయిర్‌లైన్ పేర్కొన్న ప్రయాణీకుడికి గంటలోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని DGCA వెల్లడించింది.

ఇదే క్రమంలో విమానయాన సంస్థ సదరు ప్రయాణికుడికి 24 గంటల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాటు అందించగలిగితే.. రూ. 10,000 వరకు పరిహారం చెల్లించాలని తెలిపింది. 24 గంటలకు మించి ప్రత్యామ్నాయాన్ని చూపలేక పోతే రూ. 20,000 వరకు పరిహారం చెల్లించాల్సిందేనని డీజీసీఏ వెల్లడించింది. ఈ చర్యల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించడంలో తోడ్పడుతుందని తెలుస్తోంది.