Business Ideas: టెక్నాలజీని వాడుకుంటూ.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకోవచ్చు! పల్లెటూర్లో ఉండేవారికి మంచి అవకాశం..

వ్యవసాయ కూలీల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను ఆదాయ వనరుగా మార్చుకోండి. డ్రోన్ సాయంతో పొలాల్లో పురుగు మందుల పిచికారీ సేవలు అందిస్తూ నెలకు రూ.90,000 వరకు సంపాదించవచ్చు. కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించి, వ్యవసాయం చేయకుండానే వ్యవసాయ రంగంపై ఆధారపడి అద్భుతమైన లాభాలు పొందవచ్చు.

Business Ideas: టెక్నాలజీని వాడుకుంటూ.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకోవచ్చు! పల్లెటూర్లో ఉండేవారికి మంచి అవకాశం..
అలాగే తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి నుండి బదిలీ చేయబడిన భూమిని కలిగి ఉన్న పిల్లలకు కూడా PM కిసాన్ డబ్బు అందదు. కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి పీఎం కిసాన్ రాదు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి వస్తుంది.

Updated on: Oct 28, 2025 | 8:15 AM

మన దేశంలో పల్లెటూర్లు అంటే చాలా మంది జీవనోపాధి వ్యవసాయం అనుకుంటారు. వామ్మో వ్యవసాయం చేయడం అంటే మాటలు కాదు.. ఎండా వానా తేడా లేకుండా చెమట చిందించాలని అనుకుంటారు. అది వంద శాతం నిజం. అయితే వ్యవసాయం చేయకుండా.. వ్యవసాయంపై ఆధారపడి నెలకు రూ.లక్ష సంపాదించవచ్చు అంటే మీరు నమ్ముతారా? నిజం అలాంటి ఓ అద్భుతమైన బిజినెస్‌ ఐడియా ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యవసాయ రంగం ప్రస్తుతం వ్యవసాయ కూలీల కొరత ఎదుర్కొంటోంది. తెలంగాణలో వ్యవసాయ పనులు చేసేందుకు కొన్నేళ్లుగా మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా కూలీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయినా కూడా ఇక్కడి రైతులు సమయానికి కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదే కొరతను మీరు బిజినెస్‌ ఐడియాగా మార్చుకోవచ్చు. పొలాల్లో పురుగు మందులను మీరు డ్రోన్‌ సాయంతో పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు.

అందుకోసం ఒక అగ్రికల్చర్‌ డ్రోన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ డ్రోన్‌ ఆపరేటింగ్‌ పెద్ద కష్టం ఏమీ కాదు. డ్రోన్‌ అమ్మేవారు అది ఎలా నడపాలో ట్రైనింగ్‌ కూడా ఇస్తారు. ఓ రూ.4 లక్షల నుంచి ఈ డ్రోన్‌ ధరలు ఉంటాయి. ఒక ఎకరం పొలానికి పురుగు మందులు పిచికారి చేస్తే అన్నీ ఖర్చులు పోనూ ఓ రూ.300 మిగులుతాయి. అలా రోజుకే పది ఎకరాలు చేసినా.. రోజుకు రూ.3000, నెలకు రూ.90 వేల ఆదాయం పొందవచ్చు. పల్లెటూర్లో ఉంటూ నెలకు రూ.90 వేల సంపద అంటే మాటలు కాదు. సో.. మీకు ఆసక్తి ఉంటే ఈ బిజినెస్‌ గురించి మరింత సమాచారం తెలుసుకొని రంగంలోకి దూకండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి