గృహ కొనుగోలుదారులకు తీపికబురు.. వాటిపై ట్యాక్స్ రిలాక్సేషన్.. పూర్తి వివరాలు

|

Aug 07, 2024 | 8:37 AM

ప్రాపర్టీ లావాదేవీలపై క్యాపిటల్ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించేవారికి కేంద్రప్రభుత్వం కొంత రిలీఫ్‌ ఇచ్చింది. క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మీద బడ్జెట్‌లో చేసిన మార్పులు గగ్గోలు పుట్టించడంతో, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌..

గృహ కొనుగోలుదారులకు తీపికబురు.. వాటిపై ట్యాక్స్ రిలాక్సేషన్.. పూర్తి వివరాలు
House Buying
Follow us on

ప్రాపర్టీ లావాదేవీలపై క్యాపిటల్ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించేవారికి కేంద్రప్రభుత్వం కొంత రిలీఫ్‌ ఇచ్చింది. క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మీద బడ్జెట్‌లో చేసిన మార్పులు గగ్గోలు పుట్టించడంతో, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న ఫైనాన్స్‌ బిల్లులో ఊరట కల్పించారు. జులై 23కు ముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీలపై మొన్నటి బడ్జెట్‌లో క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. అయితే అప్పటివరకు ఉన్న ఇండెక్సేషన్‌ ప్రయోజనాలను తొలగించారు.

ఇండెక్సేషన్‌ అంటే లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ట్యాక్స్‌ చెల్లించడం అన్నమాట. ప్రభుత్వ ప్రతిపాదనపై దుమారం రేగింది. దీంతో ఒక మార్పు చేశారు. ఇండెక్సేషన్‌ లేకుండా 12.5 శాతం ట్యాక్స్‌ చెల్లించవచ్చనీ, లేదా ఇండెక్సేషన్‌తో కూడిన 20 శాతం ట్యాక్స్‌ను చెల్లించేవిధంగా ఆర్థికమంత్రి ఒక ఛాయిస్‌ ఇచ్చారు. ఈ రెండింట్లో ఏ ట్యాక్స్‌ తక్కువగా ఉంటే, అది చెల్లించవచ్చని నిన్న ఫైనాన్స్‌బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి చెప్పారు. ఈ బిల్లును ఇవాళ లోక్‌సభ ఆమోదించే అవకాశం ఉంది.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..