జియో వినియోగదారులకు ఝలక్.. ఇక త్వరలోనే..

జియో టెలికాం సంస్థ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇన్ని రోజులు అన్ లిమిటెడ్ కాలింగ్‌ ఉండటంతో.. అంతా జియోవైపు మొగ్గుచూపారు. అయితే ఆ తర్వాత ఇటీవల అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి.. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కు చేసే కాల్స్‌కు చార్జీలను వసూలు చేస్తోంది. నిమిషానికి 6 పైసలు అని చెప్పినా.. అది కాస్త ఎక్కువే పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఝలక్ ఇవ్వబోతున్నట్లు […]

జియో వినియోగదారులకు ఝలక్.. ఇక త్వరలోనే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 20, 2019 | 4:01 PM

జియో టెలికాం సంస్థ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇన్ని రోజులు అన్ లిమిటెడ్ కాలింగ్‌ ఉండటంతో.. అంతా జియోవైపు మొగ్గుచూపారు. అయితే ఆ తర్వాత ఇటీవల అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి.. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కు చేసే కాల్స్‌కు చార్జీలను వసూలు చేస్తోంది. నిమిషానికి 6 పైసలు అని చెప్పినా.. అది కాస్త ఎక్కువే పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

జియో పెంచిన చార్జీల బాటలోనే ఇప్పుడు ఇతర నెట్‌వర్క్స్‌ ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలు కూడా ఉచితానికి చెక్ పెట్టి.. ఇక చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ చార్జీలను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జియో చార్జీలను వసూలు చేస్తుండటంతో.. మిగతా నెట్‌వర్క్స్‌కు కాస్త ధైర్యంగా ఉంది. అయితే ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు జియో మరోసారి వినయోగదారుల నెత్తిన మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. మరోమారు డాటా, కాలింగ్ చార్జీలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే ఈ చార్జీల పెంపుతో డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండబోతున్నట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. ఇతర ఆపరేటర్ల మాదిరిగానే ప్రభుత్వంతో కలిసే పనిచేస్తామని.. ట్రాయ్ నిబంధనలకు లోబడే ఉంటామని పేర్కొంది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేసే చర్యల్లో జియో కూడా తోడ్పాటు అందిస్తుందని.. వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుతూ.. చార్జీల పెంపుదల వల్ల డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ప్రభావం చూపకుండా ప్రయత్నిస్తామని పేర్కొంది.

అంతేకాదు.. ధరల నియంత్రణపై ట్రాయ్ ఓ నిర్ణయానికి వస్తే.. అప్పుడు చార్జీల సవరణపై దృష్టి పెడతామని.. అందుబాటులో అందరికీ డేటా, డిజిటిల్ ఇండియా ప్రయత్నంలో తమ భాగస్వామ్యం కంటిన్యూ అవుతుందని తెలిపింది.