AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరం లేని ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. చవకైన ధరలోనే అందుబాటులోకి.. పూర్తి వివరాలు

హీరో కంపెనీ మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఆవిష్కరించింది. దాని పేరు హీరో ఎలక్ట్రిక్‌ అట్రియా. ఇది ఒకే వెర్షన్‌లో రెండు కలర్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మన దేశంలో అట్రియా స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 77,767గా ఉంది. దీనికి ముందు వెనుక డ్రమ్‌ బ్రేక్‌లే ఉంటాయి. హీరో నుంచి వచ్చిన ఈ అట్రియా లో స్పీడ్‌ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, రేంజ్‌ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hero Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరం లేని ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. చవకైన ధరలోనే అందుబాటులోకి.. పూర్తి వివరాలు
Hero Atria Electric Scooter
Madhu
|

Updated on: Aug 04, 2023 | 3:00 PM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు హాట్‌ కేకులే. ముఖ్యంగా ఓలా, ఏథర్‌ వంటి కంపెనీలు టూవీలర్‌ రంగంలో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయనే చెప్పాలి. అత్యాధునిక ఫీచర్లు, అత్యధిక రేంజ్‌తో స్కూటర్లను అందిస్తూ దేశంలోనే టాప్‌ లెవెల్లో విక్రయాలు చేస్తున్నాయి. దీంతో సంప్రదాయ ఇంధన రంగంలో దిగ్గజాలైన పలు కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ బాట పడుతున్నాయి. ఇప్పటికే హీరో, టీవీఎస్‌, హోండా, యమహా వంటి కంపెనీలు తమ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లను మార్కెట్లోకి లాంచ్‌ చేశాయి. ఇదే క్రమంలో హీరో కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఆవిష్కరించింది. దాని పేరు హీరో ఎలక్ట్రిక్‌ అట్రియా. ఇది ఒకే వెర్షన్‌లో రెండు కలర్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మన దేశంలో అట్రియా స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 77,767గా ఉంది. ఈ స్కూటర్‌లో 250వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌ ఉంటుంది. దీనికి ముందు వెనుక డ్రమ్‌ బ్రేక్‌లే ఉంటాయి. హీరో నుంచి వచ్చిన ఈ అట్రియా లో స్పీడ్‌ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, రేంజ్‌ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హీరో అట్రియా బ్యాటరీ, రేంజ్..

ఈ హీరో అట్రియా స్కూటర్‌ ఒకే మోడల్‌లో అందుబాటులో ఉంది. అది అట్రియా ఎల్‌ఎక్స్‌. ఇది లో స్పీడ్‌ స్కూటర్‌. గరిష్టంగా గంటకు 25కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలుగుతుంది. అందువల్ల దీనికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ గానీ, రిజిస్ట్రేషన్‌ గానీ అవసరమే లేదు. ఈ స్కూటర్‌ లో 250వాట్ల సామర్థ్యంతో కూడిని బీఎల్‌డీసీ మోటార్‌ ఉంటుంది. 51.2V/30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. బ్యాటరీ పూర్తి ఛార్జింగ్‌ చేస్తేఏ 85కిమీ రేంజ్‌ని అందిస్తుంది. బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోని లో స్పీడ్‌ విభాగంలోని స్కూటర్లతో ఇది పోటీ పడుతుంది.

హీరో అట్రియా ఫీచర్లు..

ఈ స్కూటర్లో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌లైట్, కంప్యూటరైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. హెడ్‌లైట్, డీఆర్‌ఎల్‌, టెయిల్‌లైట్‌లు ఎల్‌ఈడీలతో ఉంటాయి. కొనుగోలుదారులు రెండు సింగిల్-టోన్ రంగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అవి గ్రే, రెడ్‌. హీరో అట్రియాలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, సస్పెన్షన్ కోసం ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు, స్టాపింగ్ కోసం రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. స్కూటర్ 12-అంగుళాల చక్రాలను కలిగి ఉంటాయి. స్కూటర్‌ బరువు 69 కేజీలు మాత్రమే. యూఎస్బీ చార్జింగ్‌ పోర్టు కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..