Stock: మార్కెట్లు పడిపోతున్నా పెరిగిన స్టాక్.. షేర్ విలువ ఇంకెంత పెరుగుతుందంటే..

|

Jun 06, 2022 | 1:09 PM

Stock: మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ AEGISCHEM (ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్) షేర్లు 3% కంటే ఎక్కువ లాభపడింది. దీంతో సోమవారం ట్రేడింగ్ సెషన్ ప్రారంభ సమయాల్లో నిఫ్టీ- 500 సూచీలో టాప్ గెయినర్స్ లో ఒకటిగా నిలిచింది.

Stock: మార్కెట్లు పడిపోతున్నా పెరిగిన స్టాక్.. షేర్ విలువ ఇంకెంత పెరుగుతుందంటే..
stock Market
Follow us on

Stock: మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ AEGISCHEM (ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్) షేర్లు 3% కంటే ఎక్కువ లాభపడింది. దీంతో సోమవారం ట్రేడింగ్ సెషన్ ప్రారంభ సమయాల్లో నిఫ్టీ- 500 సూచీలో టాప్ గెయినర్స్ లో ఒకటిగా నిలిచింది. 2022 నాల్గవ త్రైమాసికంలో అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు బలమైన కొనుగోళ్లకు కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్వార్టర్ ఫలితాల తర్వాత వారంలో షేరు దాదాపు 12% ఎగబాకింది. ఇది కాకుండా.. స్టాక్ దాని కనిష్టమైన రూ. 187 నుంచి దాదాపు 26% లాభపడింది. దీనితో.. స్టాక్ దాని 200-DMAని దాటింది. అన్ని ముఖ్యమైన మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా.. ఇతర టెక్నికల్ ఇండికేటర్లు బుల్లిష్‌నెస్‌ను సూచిస్తున్నాయి. 14-పీరియడ్ రోజువారీ RSI (61.70) బుల్లిష్ జోన్‌లో ఉండటం స్టాక్‌లో బలాన్ని సూచిస్తోంది.

ఆసక్తికరంగా.. ADX ఊపందుకుంది. ఇది స్టాక్‌కు బలమైన అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. ఇంతలో MACD హిస్టోగ్రాం పెరుగుదల బుల్లిష్ మొమెంటంను చూపుతోంది. OBV గరిష్ట స్థాయిలో ఉంది. వాల్యూమ్ కోణం నుంచి స్టాక్ బుల్లిష్‌గా ఉంది. అలాగే KST, TSI స్టాక్ కోసం బుల్లిష్ అవుట్‌లుక్‌ను సూచిస్తున్నాయి

ఈ షేరు మునుపటి స్వింగ్ హై రూ.228.40ని దాటింది. ఈరోజు నమోదు చేయబడిన సగటు వాల్యూమ్ 10-రోజులు, 30-రోజుల సగటు వాల్యూమ్ కంటే ఎక్కువగా ఉంది. YTD ప్రాతిపదికన స్టాక్ దాదాపు 4% పెరిగింది. అయితే ఇది ఒక నెలలో 12% పెరిగింది. ఈ స్టాక్ బుల్లిష్ బాటలో ఉంది. ఇది ఊపందుకోవడంతో ట్రేడ్ అవుతుందని అంచనా. రానున్న కాలంలో షేర్ విలువ రూ.248 స్థాయిని తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.