Cement Deal: ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ హోల్సిమ్ గ్రూప్(Holcim Group) వాటాల విక్రయానికి వ్యాపార దిగ్గజాలైన అదానీ గ్రూప్, JSW గ్రూప్‌లతో చర్చలు ప్రారంభించింది. ఈ భారీ డీల్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ సేల్ ద్వారా దేశంలో కంపెనీకి ఉన్న అంబుజా సిమెంట్, ACC సిమెంట్ కంపెనీలను విక్రయించనుంది. ప్రస్తుతం ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు జాతీయ మీడియా వార్తల ప్రకారం తెలుస్తోంది. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లాకు(Kumar Mangalam Birla) చెందిన అల్ట్రాటెక్ సంస్థ కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరపలేదు. కంపెనీ వ్యతిరేక ఆందోళనలు ఉన్నప్పటికీ, పోటీలో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరులోగా షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ చర్చలు పూర్తవుతాయని తెలుస్తోంది. ఈ లోగా ఫైనాన్సింగ్‌కు సంబంధించిన అన్ని వివరాలు వ్యక్తం కావచ్చు.
షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ నిబంధనలను ఖరారు చేసిన తర్వాత.. “కమిటెడ్ ఫైనాన్సింగ్ చూపేందుకు” అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అది పూర్తయిన తర్వాత ముందుగా సదరు కంపెనీ ఆస్తులను పొందుతుంది. అంబుజా సిమెంట్స్, ACC సిమెంట్స్ రెండూ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్టెడ్ కంపెనీలేనని సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ పేర్కొన్నాడు. సేల్ రిపోర్ట్‌లు వెలువడినప్పటి నుంచి ఈ కంపెనీల షేర్లు ఓలటైల్ గా మారాయి. కంపెనీ తన ఆప్షన్స్ తెరిచి ఉంచుతోందని, సూటర్‌ను ఖరారు చేసిన తర్వాత, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని హోల్సిమ్ అంతిమ నిర్ణయాన్ని 12-14 గంటల్లో ప్రకటిస్తుందని తెలుస్తోంది. దీర్ఘకాల చర్చల కోసం కంపెనీలు ప్రత్యేక ఒప్పందంలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Fertility Rate Drop: దేశంలో నానాటికీ పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. అత్యధికంగా వారిలోనే..
Mahbubnagar Attack: దారుణం.. వంట పాత్రలు కడగమన్నందుకు తల్లిపై కూతురు కర్కశత్వం.. గొంతు కోసి..