Honda Activa: యాక్టివా 2025 వెర్షన్ రిలీజ్.. సూపర్ ఫీచర్లతో ఆ స్కూటర్లకు గట్టిపోటీ

|

Jan 24, 2025 | 5:15 PM

భారతదేశ ప్రజలకు స్కూటర్ అంటే టక్కున గుర్తు వచ్చేది హోండా కంపెనీకు చెందినయాక్టివా. గత పదేళ్లుగా స్కూటర్ల రంగాన్ని యాక్టివా తన అమ్మకాలతో శాసిస్తుంది. ఇతర కంపెనీలు కూడా యాక్టివాకు పోటీగా నూతన ఫీచర్లతో స్కూటర్లను రిలీజ్ చేసినా యాక్టివా అమ్మకాల స్థాయిను తాకలేకపోయాయి. యాక్టివా కూడా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్స్‌తో యాక్టివా స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ ఉంది. తాజాగా 2025వ సంవత్సరంలో సరికొత్త అప్‌డేట్స్ మన ముందుకు వస్తుంది.

Honda Activa: యాక్టివా 2025 వెర్షన్ రిలీజ్.. సూపర్ ఫీచర్లతో ఆ స్కూటర్లకు గట్టిపోటీ
Activa 2025 Version
Follow us on

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల యాక్టివా స్కూటర్ తాజా వెర్షన్‌లతో తన లైనప్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. జపనీస్ తయారీదారు ఉబెర్ పాపులర్ యాక్టివాకు సంబంధించిన 2025 వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 80,950 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయించే ఈ స్కూటర్ ఎస్టీడీ, డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా 2025 హోండా యాక్టివాలో పెద్దగా మార్పులు లేనట్లుగానే ఉంటుంది. 2025 వెర్షన్ యాక్టివా ఆరు పెయింట్ స్కీమ్ ఎంపికలతో వస్తుంది. ఈ జాబితాలో పెర్ల్ సైరన్ బ్లూ, పెర్ల్ ప్రెషియస్ వైట్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, రెబెల్ రెడ్ మెటాలిక్ రంగుల్లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది. 

యాక్టివా స్కూటర్‌కు సంబంధించిన కొత్త వెర్షన్‌లోని పొడిగించిన ఫీచర్ లిస్ట్‌లో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. ముఖ్యంగా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో రావడంతో రైడర్‌ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌లను పొందడం వంటి ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫోన్ చార్జింగ్‌కు ఉపయోగపడేలా యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్‌‌తో చార్జింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. 

2025 హోండా యాక్టివాలో అప్‌డేటెడ్ ఓబీడీ2బీ కంప్లైంట్ 109.51 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ 8,000 ఆర్‌పీఎం వద్ద 7.8 హెచ్‌పీ శక్తిని, 5,500 ఆర్‌పీఎం వద్ద 9.05 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్రాండ్ మిక్స్‌కు ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌‌తో వస్తుంది. ఈ సూపర్ ఫీచర్లతో యాక్టివా 2025 వెర్షన్ టీవీఎస్ జూపిటర్, హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ వంటి ప్రధాన స్కూటర్లకు పోటీనివ్వనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి