7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దీపావళికి ముందే బహుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1, 2021 నుంచి పెరిగిన డీఏను అమలు చేస్తూ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు 4 నెలల డీఏ బకాయిలను ఒకేసారి పొందనున్నారు. ఈనెలలో ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.
7వ పే కమిషన్ కింద పెరిగిన ఈ డీఏ వల్ల మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 9,488.70 కోట్ల భారం పడనుంది.
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 56,900 అనుకుందాం.. అయితే అతనికి 31 శాతం చొప్పున నెలకు డీఏ రూ. 1,707 పెరుగుతుంది. ఏటా లెక్క తీసుకుంటే ఏడాదికి రూ. 20,484 పెరగనుంది. ఒకవేళ ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 18,000 అయితే.. అతనికి 31 శాతం డీఏతో రూ. 5,580డీఏగా పొందుతాడు. అంటే ఉద్యోగి మూల వేతనంపై ఇప్పుడు అదనంగా రూ. 1620 డీఏ లభిస్తుంది. గతంలో అయితే ఇది రూ. 540గా ఉండేది.
Also Read: Tragedy: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు..