మీ దగ్గర డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయా.? వాటిని తరచూ వాడుతుంటారా.? అయితే మీకో గుడ్ న్యూస్. రూ. 10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. సహజంగా క్రెడిట్, డెబిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. వాటి గురించి ఖాతాదారులకు పెద్దగా తెలియదు. అయితే బిజినెస్ నిపుణులు మాత్రం కొన్ని బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డుల బట్టి బీమా కవరేజీని అందిస్తాయని అంటున్నారు.
ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందినా బీమాను అందిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డు వేరియంట్ల బట్టి రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుందని ఇండియన్ బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా లేదా స్వయంకృతాపర్ధం వల్ల జరిగిన ప్రమాదాలకు బీమా కవరేజీ వర్తించదని చెప్పుకొచ్చారు.
బ్యాంకుతో వినియోగారుడికి ఉన్న సంబంధం బట్టి బీమా కవరేజీ ఉంటుందని.. డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కాగా, ఇలాంటి సదుపాయాలు ఉన్నాయని బ్యాంకులు ఖాతాదారులకు విధిగా తెలియజేయాలి. వీటిపై వారికి ఎలాంటి అవగాహనా ఉండదని వినియోగదారుల ఫోరం యాక్టివిస్ట్ శ్రీ సదాగోపన్ స్పష్టం చేశారు. బీమా క్లెయిమ్ చేసుకోవాలంటే కార్డులను యాక్టివ్‌గా వాడుతూ ఉండాలని తెలిపారు. క్లెయిమ్‌ల కోసం నిర్దిష్ట సమయంలో సమాచారం అందించాల్సి ఉంటుంది.
Also Read:
రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!
మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!